Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈయన సినీ కెరియర్ లో సూపర్ హిట్ చిత్రమైనటువంటి దేశముదురు సినిమాను తిరిగి విడుదల చేశారు. ఈ సినిమా ఏప్రిల్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమాని హైదరాబాద్లోని సంధ్య 70 ఎంఎం థియేటర్లో విడుదల చేశారు. ఇక ఈ సినిమా చూడటం కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఏకంగా థియేటర్లోనే టపాసులు పేలుస్తూ రచ్చ చేశారు. ఇలా ఒక్కసారిగా టపాకాయల మోత మోగడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అరుపులతో, కేకలతో గోల చేశారు.
దీంతో అలర్ట్ అయిన థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు థియేటర్ వద్దకు చేరుకొని షో ఆపివేయడమే కాకుండా అందరిని థియేటర్ నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయాన్ని నిర్మాత శ్రీనివాస్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలియజేయడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది.

Allu Arjun: థియేటర్ దేవాలయం లాంటిది….
ఈ విధంగా అభిమానులు హీరోల పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చాటుకోవడం తప్పు కాదు కానీ థియేటర్లో ఇలాంటి పనులు చేయడం మంచిది కాదని థియేటర్ తమకు ఒక దేవాలయం లాంటిదని ఈయన తెలియజేశారు. దేవాలయాలను సంరక్షించుకుందాం అంటూ శ్రీనివాస్ కుమార్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.సాధారణంగా ఒక హీరో సినిమా వస్తుంది అంటే థియేటర్ ముందు పండగ వాతావరణం ఉండేది అయితే ఈ మధ్యకాలంలో అభిమానులు అత్యుత్సాహం కారణంగా థియేటర్లోనే టపాసులు పేలుస్తూ ఇతర ప్రేక్షకులకు ఇబ్బందికరంగా మారుతున్నారని చెప్పాలి.
Police interpreted the show due to the hugeee crowds and bursting crackers inside Sandhya 70 mm
Request fans don’t damage seats and burst crackers inside theaters
Enjoy the single screen Euphoria Respect and protect theaters which r our temples ????❤️#Desamuduru4KSpecialShows pic.twitter.com/YtgCKRFABz
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 6, 2023































