పట్టాలెక్కబోతున్న అల్లు అర్జున్ కొరటాల మూవీ..!!

0
214

రచయితగా కొన్ని సినిమాలకు పనిచేసిన కొరటాల తర్వాత మిర్చి సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తాడు.ఫెయిల్యూర్ అంటూ తెలియని కొరటాల మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్స్ అందించి సినీ పరిశ్రమ విస్తుపోయేలా చేశాడు.ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్, ఎన్టీఆర్ లతో చెరొక సినిమా మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసి తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్నాడు.

అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ ఈ సినిమా అల్లు అర్జున్ కి ఒక గ్రాండ్ వెల్కమ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా తెలుగు,హిందీ భాషల్లో తీస్తున్నప్పటికీ నటీనటులు ఎక్కువగా తెలుగువారే ఉన్నారు.ఆచార్య సినిమా అనంతరం కొరటాల ఏ యంగ్ స్టార్ తో సినిమా తీయబోతున్నాడో అని సినీ ప్రముఖులు ఇటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలో బన్నీ, కొరటాల శివ తో ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు ప్రకటించి సినీ ఇండస్ట్రీలో ఒక బజ్ క్రియేట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here