“పవర్ స్టార్” సినిమా విడుదలను ఆపకపోతే రామ్ గోపాల్ వర్మ ను టాలీవుడ్ ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తా..
(మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్ట్రాంగ్ వార్నింగ్)

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేంద్ర బిందువన్న సంగతి తెలిసిందే. ఆర్జీవి
తాజాగా “పవర్ స్టార్” చిత్రంలో నుండి ఓ కొత్త పాట విడుదల చేశారు. దీంతో మళ్లీ ఆయన మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడని.. ముఖ్యంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడని పవన్ ఫ్యాన్స్ కి అర్ధమై పోయింది.

రామ్ గోపాల్ వర్మ ఇలా వ్యక్తులను టార్గెట్ చేయడం క్రొత్తమీ కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలెదురైనప్పుడు కూడా ఇలా చేయవద్దని ఎన్నో రకాలుగా నచ్చ చెప్పినా రామ్ గోపాల్ వర్మ తన పద్ధతిని మాత్రం మార్చుకోవడం లేదని ఇక మెగా ఫ్యామిలీలోనే ఎవరో ఒకరు రంగంలోకి దిగితేనే కానీ రామ్ గోపాల్ వర్మ మాట వినేలా లేడని అందుకే ఈరోజు మీడియా ముందుకొచ్చానని టాలీవుడ్ పెద్దలలో ఒకరైన అల్లు అరవింద్ తెలియ జేశారు. మెగా ఫ్యామిలీకి, రామ్ గోపాల్ వర్మకు ఎప్పటి నుంచో పడదని, వర్మ మనస్తత్వం నీచాతి నీచమైనదని.. ఆయనో నికృష్టుడని, గత కొన్ని రోజలుగా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలను ఎంతో సహనంగా చూశామని, తప్పనిసరి పరిస్థితుల్లో తాను బయటికి రావాల్సి వచ్చిందని, తెలుగు చలన చిత్రసీమ ద్వారా ఎదిగిన రామ్ గోపాల్ వర్మ చివరికి తల్లి లాంటి టాలీవుడ్ నే టార్గెట్ చేస్తూ ఇలాంటి దిగుజారుడు సినిమాలను తీయడం చాలా బాధ కలిగించిందని అల్లు అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత సంఘటనలను చూశాక వర్మపై ఉన్న గౌరవం పూర్తిగా పోయిందన్నారు. గతంలో కూడా ఇలాగే పవన్ పై తనకున్న కోపాన్ని శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకుని తీర్చుకున్నాడని, వర్మ తడిగుడ్డతో గొంతులు కోసే రకమని అల్లు అరవింద్ రాంగోపాల్ వర్మ పై ఫైర్ అయ్యారు. వెంటనే తన పద్ధతిని మార్చుకోవాలని తెలుగు సినీ చిత్రసీమ ఓ అందమైన కుటుంబమని అందులో ఉన్నవాళ్ళందరూ ఐకమత్యంతో కలిసుండాలని ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడం, ఒకళ్ళని టార్గెట్ చేసి మరొకరు సినిమాలు తీయడం సరైన పద్ధతి కాదని.. “పవర్ స్టార్” సినిమా విడుదలను వెంటనే ఆపకపోతే రామ్ గోపాల్ వర్మ ను టాలీవుడ్ ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తానని అల్లు అరవింద్ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారు.



























