Amala akkineni: అక్కినేని కుటుంబం సినిమా ఇండస్ట్రీ లో పెద్ద కుటుంబాల్లో ఒకటి. అటు నిర్మాణ సంస్థలు ఇటు హీరోలు ఇక స్టూడియో అలా సినిమా పరిశ్రమలో అన్ని రంగాల్లోను ఉన్నారు. ఇక లెజెండరీ యాక్టర్ నాగేశ్వరావు గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ అక్కినేని నాగార్జున టాప్ హీరోస్ లో ఒకడిగా ఉన్నారు. రొమాంటిక్ హీరోగా మహిళ ప్రేక్షకుల ఫాలోయింగ్ తో తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు. ఇక నాగార్జున తరువాత అక్కినేని కుటుంబం నుండి నాగేశ్వరావు కూతుళ్ల కొడుకులు సుమంత్ సుశాంత్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక నాగార్జున మేనకోడలు నిర్మాణ సంస్థ భాద్యతలు చూసుకుంటున్నారు. ఇక నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ కూడా హీరోలుగా కొనసాగుతున్నారు.

అఖిల్ కి చైతన్య ఉంటే నేను అవసరం లేదు….
ఇక నాగచైతన్య, అఖిల్ ఇద్దరు అన్నదమ్ములే అయిన తల్లులు వేరనే సంగతి అందరికి తెలిసిందే. నాగచైతన్య తల్లి నాగార్జున మొదటి భార్య దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మి కొడుకు. నాగార్జున లక్ష్మి విడిపోయాక నాగచైతన్య తల్లి వద్ద చెన్నై లో పెరిగాడు. ఇక అమల ను పెళ్లి చేసుకున్న నాగార్జున కు అఖిల్ పుట్టాడు. అఖిల్ హైదరాబాద్ లో పెరిగాడు. సెలవులకు నాగ చైతన్య, హైదరాబాద్ వచ్చి నాగార్జున తో గడిపేవాడట. నాగచైతన్య, అఖిల్ బాగా ఆడుకునే వారట. చైతు ఉంటే ఇక అఖిల్ కు నా అవసరం ఉండదంటూ అమల ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వారిద్దరి మధ్య బాండింగ్ ను షేర్ చేసుకున్నారు చైతన్య చాలా కామ్ గా ఉంటాడు అఖిల్ బాగా అల్లరి చేస్తాడు అంటూ చెప్పారు.

నాగచైతన్య ఎపుడు హైదరాబాద్ వస్తాడా అని అఖిల్ ఎదురుచూసేవాడట. ఇక నాగచైతన్య ను తన తల్లి లక్ష్మి ఎంతో పద్దతిగా పెంచిందని అమల చెప్పారు. హైదరాబాద్ వస్తే చైతూ వాళ్ల నాన్నతో బాగా ముచ్చట్లు పెట్టుకుంటారంటూ ఎప్పటి సంగతులను చెప్పరు అమల అక్కినేని. నాగచైతన్య వాల్ల అమ్మ లక్ష్మి గురించి అమల మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఎపుడు బాగా వైరల్ అవుతున్నాయి.

































