కోడలు సమంతపై అత్తమ్మ అమల షాకింగ్ కామెంట్స్ చేసారు. సమంత ఇంటి కోడలు అయినప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్కసారికూడా ఇంట్లో వంట చేసి పెట్టలేదట. ఇటీవలే ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ అక్కినేని అమల తన కోడలు షాకింగ్ విషయం చెప్పారు. తమ ఫ్యామిలీలో నాగార్జున వంట అద్భుతంగా చేస్తాడట. ఇటువంటి మంచి కుక్ ఉన్నప్పుడు మరొకరిని తీసుకోవడం ఎందుకు అని సరదాగా కామెంట్ చేసారు అమల అక్కినేని. వంట చేయడంలో నాగార్జున పర్ఫెక్ట్ అని, ఇంకా సమంతకు, నాకు ఇద్దరికీ వంట చేయడం సరిగ్గా రాదనీ చెప్పారు అమల.

మరోవైపు చైతు కూడా ఇంట్లో మంచి వంటలు చేస్తాడంటూ అనేకసార్లు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. 2017లో చైతు – సమంత ఇద్దరు ఒకటయ్యారు. అంతకు ముందు మొదటి సినిమా “ఏ మాయ చేసావే” సినిమా నుండి వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ కలిసి “మజిలీ” సినిమాలో నటించారు. పెళ్లి తరువాత కూడా సమంత తన మార్క్ సినిమాలతో సూపర్ స్టార్ హీరోయిన్ గా తన సత్తా చూపిస్తోంది.





























