Amala Paul : మలయాలం లో మొదలు పెట్టి తమిళం, తెలుగు, కన్నడ వంటి అన్ని భాషలలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్, ప్రస్తుతం తెలుగులో కనిపించడం లేదు కానీ తమిళం, మలయాళం లో సినిమాలు, వెబ్ సిరీస్ లంటూ బిజీగా ఉంది. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు డైరెక్టర్ ను పెళ్లి చేసుకుని ఆ తరువాత విడాకులు తీసుకుని ఇపుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్న అమలా పాల్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.

పోస్టు మార్టం నా జీవితాన్ని మార్చేసింది…
‘కడవర్’ అనే సినిమా లో నటిస్తున్న అమలా పాల్ మొదటి సారిగా ఈ సినిమా కు నిర్మాత గా కూడా వ్యవహారిస్తోంది. అనూప్ పరికర్ డైరెక్షన్ లో అభిలాష్ పిళ్ళై రైటర్ గా పనిచేస్తున్న కడవర్ సినిమా లో అమలా పాల్ పోలీస్ సర్జన్ గా చేస్తోంది. సినిమా లోని ‘భద్ర’ పాత్ర కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేసానని అమలా పాల్ చెప్పింది. ఈ సినిమాలో సర్జన్ గా చేయడం కోసం డాక్టర్స్ ఎలా ఉంటారు అని చాలా రీసెర్చ్ చేసిందట. ఆ క్రమలోనే పోస్టు మార్టం ఎలా చేస్తారో చూడటంతో ఆ దృశ్యాలు తన మనసుని కలచి వేశాయని, ఆలోచనా దృక్పదాన్ని మార్చి వేశాయని అమలా పాల్ చెప్పింది.

సినిమాకి ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న అమలా పాల్ ఇలా రియాక్ట్ అయింది. ఆ పోస్టుమార్టం చూసాక ప్రతి విషయాన్ని చూసే కోణం మారిపోయిందని చెప్పింది. భద్ర పాత్ర కోసం జుట్టు కూడా కత్తిరించుకుని ఆ పాత్రలో ఒదిగిపోవాలని అనుకున్నాను అంటూ చెప్పింది. ఇక కథ చెప్పినపుడు భద్ర పాత్ర ఎలా ఉంటుందో ఉహించుకోలేక పోయానని, చాలా రీసెర్చ్ అందుకోసం చేసానని అసలు క్రైమ్ జరిగాక ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో గ్రౌండ్ వర్క్ చేసానని చెప్పారు. ఇక ఈ సినిమా ఆగష్టు 12 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

































