శుభలగ్నం, మావిచిగురు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని..ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబలకిడి పంబ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఆమని ఆ తరువాత ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించింది. 90ల కాలంలో అత్యంత బిజీగా ఉన్న నటిమణుల్లో ఆమని ఒకరు. కేవలం గ్లామర్ రోల్స్ అనే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా హౌజ్ వైఫ్ పాత్రల్లో కూడా మెప్పించారు. చావు కబురు చల్లగా సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ ఈ సినిమాలో హీరో తల్లి పాత్ర లో నటిస్తుంది..

గడసరి పెళ్లాం పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఆమని. జగపతిబాబు కాంబినేషన్‌లో ఆమని చేసిన సినిమాలు చరిత్ర తిరగరాసాయి.ఇక ఆమని అనగానే శుభలగ్నం సినిమానే గుర్తొస్తుంది. ఆ సినిమా లో ఆమె చేసిన పెర్ఫార్మన్స్ ఎవరు మర్చిపోలేనిది.. 90 ల్లో ఈమె చేసిన పాత్రలు.. సినిమాలు ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతాయి. ఇక రీ ఎంట్రీ లో మరిన్ని సినిమాలు చేయడానికి రెడీ అంటుంది.. ఇప్పటికే కార్తికేయ నటిస్తున్న చావుకబురు చల్లగా సినిమాలో ఆమె నటిస్తుంది. మరిన్ని సినిమాలు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఓ రియాలిటీ షో కి యాంకర్ గా చేసిన ఆమె ఆ తర్వాత ఎందుకో దాన్ని కంటిన్యూ చేయలేదు.. మళ్ళీ చిన్న గ్యాప్ తీసుకుని ఈ సినిమా తోప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
తాజగా ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమని 2014లో నుంచి అసలైన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చందమామ కథలు సినిమాలో ఆమని ఎవరు ఊహించని విధంగా లిప్ లాక్ సీన్ లో నటించారు. వయసు పైబడిన పాత్రలో నటిస్తూనే రియాలిటీ లైఫ్ కు తగ్గట్లుగా సీనియర్ హీరో నరేష్ తో ముద్దు సీన్ లో నటించారు.ఆ సీన్ అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమని ఆ పాత్రపై క్లారిటీ ఇచ్చారు. అసలు కథ చెప్పినప్పుడు అలాంటి సీన్ ఉందని కూడా నాకు తెలియదని అన్నారు. ఆ సీన్ షూటింగ్ జరిగే రోజే దర్శకుడు తనతో చెప్పాడని, అయితే ఆ పాత్రకు ఆ సీన్ చాలా అవసరం కాబట్టి చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఒకవేళ ముందే చెప్పినా కూడా నేను అభ్యంతరం చెప్పేదాన్ని కాదని ఆమని అన్నారు.



























