Amardeep Chowdary : బుల్లితెర మీద ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అది కూడా సీరియల్ హీరోయిన్ తేజస్విని ని పెళ్లి చేసుకోబోతున్నాడు. కోయిలమ్మ, కేర్ ఆఫ్ అనసూయ వంటి సీరియల్స్ లో నటించిన తేజస్వినిని వివాహం చేసుకోబోతున్న అమర్ దీప్ ప్రేమ గురించి, ప్రమ వైఫల్యాల గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసాడు. పలు షార్ట్ ఫిలిమ్స్ తో నటుడుగా తన ప్రయాణం మొదలు పెట్టి , సిరి సిరి మువ్వ సీరియల్ తో నటుడుగా బుల్లితెర కు పరిచయమాయ్యడు.

ప్రేమ మీద ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు…
ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని చెప్పిన అమర్ దీప్ ప్రేమలు, బ్రేకప్ లు కామన్ అంటూ చెప్పారు. ప్రేమలో ఉన్నపుడు అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఎదుటివారికి మరీ ఎక్కువ వారి మీద అంచనాలు పెంచకూడదని మాట నిలబెట్టుకోలేని రోజున మనం ప్రేమించిన వ్యక్తి ని హర్ట్ చేస్తామని మనము హర్ట్ అవుతామని చెప్పాడు. జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవాల ఆధారంగానే ఈ విషయాన్ని చెబుతాన్నానంటూ, తాను లవ్ ఫెయిల్యూర్ అని చెప్పాడు అమర్ దీప్. ఇక ప్రేమించిన వ్యక్తి దూరమైనంత మాత్రన మనల్ని మనం బాధ పెట్టుకోవడం, లేదా వాళ్ళను బాధపెట్టడం మంచి పని కాదని చెప్పాడు.

దానివల్ల ఏ ఉపయోగం ఉండదని చెప్పాడు. ముఖ్యంగా అమ్మాయిలు ఒకసారి ఒకరి గురించి మర్చిపోవాలని డిసైడ్ అయితే ఇక మనం ఎంత వెంట పడినా వాళ్ళు మాత్రం వెనక్కి రారు. అలాంటప్పుడు వారిని బలవంతంగా అయినా మన జీవితంలోకి తెచ్చుకోవాలని అనుకోవడం మూర్ఖత్వం అంటూ యూత్ కి హిత బోధ చేసాడు. అయితే తాను ఇలాంటి మాటలు చాలా విన్నా, నా బాధ నువ్వు పడితే తెలుస్తుంది అనుకునే వాడిని కాబట్టి నా మాటలు విని మారిపోతారు అని నేను అనుకోను అంటూ చెప్పాడు. ఇక అమర్ దీప్ సొంతూరు అనంతపురం. తండ్రి రిటైర్ ఆర్టీసీ ఉద్యోగి, అమ్మ బీజేపీ ప్రెసిడెంట్ అని, నేను ఇపుడు ఉన్నత స్థానంలో ఉండటం వల్ల వారు చాలా హ్యాపీ అంటూ చెప్పాడు.



























