Amardeep Chowdary : బుల్లితెర మీద ఒక్కోమెట్టు ఎక్కుతూ నేడు పాపులర్ ఆర్టిస్టులు అయిన అమర్ దీప్ కంటే ‘జానకి కలగనలేదు’ సీరియల్ రామా అంటే బాగా తెలుస్తుంది. అంతలా సీరియల్ అభిమానులకు తన పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ కెరీర్ లో తాను ఎదుర్కొంటున్న కష్టాలను గురించి పలు ఇంటర్వ్యూ లో చెప్పారు. అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగాలి, బండి లో పెట్రోల్ అయిపోయేలా తిరగాలి అని తన అనుభవాలను చెప్పాడు. ఇక ఎన్నో అవమానాలను భరించాలని, అవకాశం వచ్చినా అదృష్టం కూడా ఉండాలని అది నాకు చాలా తక్కువ ఉందని చెప్పాడు.

జబర్దస్త్ చూడ్డానికి వెళితే చాలా చెండాలంగా మాట్లాడారు…
గుర్తింపు లేని రోజుల్లో చాలా చీప్ గా చూస్తారని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడ్తారని అలాంటివన్నీ భరించాల్సిందే అంటూ చెప్పాడు. అలా గుర్తిండిపోయే సంఘటన అంటే జబర్దస్త్ చూడ్డానికి అని వెళితే ఆ షో మేనేజర్స్ చాలా వల్గర్ గా తిట్టారు. ఆ రోజు చాలా బాధేసింది. అయితే అదే మేనేజర్లు మళ్ళీ కొన్ని నెలల తరువాత నా డేట్స్ కోసం కాల్ చేశారు. సార్ మీ డేట్స్ ఎప్పుడు ఖాళీగా ఉన్నాయి అని అడిగారు. అపుడు నేను మీ సెట్స్ కి వస్తే ఆ రోజు తిట్టారు గుర్తుందా అని అడిగాను సారీ చెప్పారు.

ఆ విషయం నేను ఆ రోజే వదిలేసాను, వాళ్లను ఏమి అనలేదు. నా డేట్స్ కోసం సార్ అని ఫోన్ చేసినపుడే వాళ్లకు పరువు పోయింది ఇంకా నేను తిట్టాల్సిన పని లేదు. సార్ అని నన్నప్పుడే వాళ్ళు నా కాళ్ళ దగ్గరికి వచ్చినట్టు కదా అని అన్నారు అమర్ దీప్. ఇలాంటి అనుమానాలు ఎన్నో భరించాలి ఇండస్ట్రీ లో, అవమానాలు భరించి గుండె రాయి గా మారిపోతుంది. ఇక సినిమాల్లో అవకాశాలు వచ్చినా షూటింగ్ అయ్యాక మనం నటించిన సన్నివేశాలు ఉంటాయో లేదో తెలియదు. శైలజ రెడ్డి అల్లుడు సినిమాలో నా సన్నివేశాలు తొలగించినపుడు చాలా బాధేసింది. కానీ ఏం చేయలేము ఇలాంటివన్నీ సహిస్తూనే ముందుకు పోవాలి అంటూ చెప్పారు.



























