Amardeep, Tejaswini : తెలుగు బుల్లితెర అభిమానులకు అమర్‌దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కస్టపడి పైకొచ్చిన వారిలో అమర్‌దీప్ కూడా ఒకరు. ప్రస్తుతం ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ లో హీరో గా చేస్తున్నాడు. అయితే త్వరలోనే అమర్‌దీప్ పెళ్లిచేసుకొని ఒక ఇంటివాడు కాబోతున్నాడు. నటి తేజస్విని తో నిశ్చితార్థం చేసుకొన్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

సర్‌ప్రైజ్ అవుతున్న అభిమానులు…
తాజాగా అమర్‌దీప్, తేజస్వినిల ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు బిగ్ బాస్ బ్యూటీ అరియానా హజరు అయ్యి వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ వేడుకకు సంబందించిన వీడియోని అరియానా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వలనే దీనిగురించి అందరికీ తెలిసింది. దీన్ని చుసిన అభిమానులు సర్‌ప్రైజ్ అవ్వడమే కాదు షాక్ అవుతున్నారు.

అమర్, తేజస్వినిల ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది, అసలు ఎవరికీ చెప్పనేలేదు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాకుండా వీరి జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తేజస్విని కూడా ఒక సీరియల్ లో నటిస్తోంది. కేర్ అఫ్ అనసూయ అనే సీరియల్ లో నటిస్తోంది తేజస్విని.































