Amardeep -Tejaswini : అమర్‌దీప్, తేజస్విని ఇద్దరూ బుల్లితెర నటీ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇద్దరూ కలసి ఒక్క సీరియల్ లో కూడా నటించలేదు. కానీ ఉన్నట్టుండి ఒకరోజు వీరి నిశ్చితార్త వేడుకకు సంబందించిన ఫోటోలతో అందరినీ షాక్ కు గురించేశారు. అసలు వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది, ఇంత రహస్యంగా ఇలా ఎలా చేశారు అని ఒకింత ఆశ్చర్యం కలిగినా అందరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేసారు. అయితే ఈ జంట ఒక టీవీ ప్రోగ్రాంలో కలసి సందడి చేశారు. దీనికి సంబందించిన ప్రోమో వైరల్ అవుతోంది.

కాబోయే భార్యకు జీవితంలో మర్చిపోలేని సర్ ప్రైస్…
వినాయక చవితి సందర్బంగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ప్రోగ్రాంకు నిశ్చిత్తార్తం తర్వాత మొదటి సారి అమర్ దీప్ తేజస్వినిలు కలసి పాల్గొన్నారు. తేజస్విని తో పాటు వాళ్ళ అమ్మ గారు కూడా వచ్చారు. అయితే వీరి పరిచయం ప్రేమ ఇలాంటి ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వీరి ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది ఇక్కడి వరకు ఎలా వచ్చారు అని స్టేజి మీద పెర్ఫార్మ్ చేశారు. ఎంతో సరదాగా సాగుతున్న ప్రోమోలో అమర్ దీప్, తేజస్వినికి గిఫ్ట్ ఇవ్వడం కోసం తనకు, వాళ్ల అమ్మకు కళ్ళుమూశారు.

తరువాత ఎన్నో ఏళ్ళ క్రితం చనిపోయిన తేజస్విని వాళ్ళ నాన్న గారి మైనపు విగ్రహాన్ని స్టేజి మీదకు తీసుకు వచ్చి వీరి కళ్ళకు గంతులు తీసారు. తేజస్విని, వాళ్ళ అమ్మ తో పాటు స్టేజి మీద ఉన్న అందరూ ఎమోషనల్ అయ్యి కంటతదడి పెట్టుకున్మారు. తేజస్విని వాళ్ళ అమ్మ.. భర్త ప్రేమతో పాటు తండ్రి ప్రేమను పంచే వ్యక్తి నా కుమార్తెకి భర్తగా దొరికాడు, ఈరోజు అడి నువ్వు నిరూపించుకున్నావు.. లవ్ యూ నాన్న.. అంటూ ఎమోషనల్ కాగా దానికి అమర్‌దీప్ లవ్యూ అమ్మ అని చెప్పాడు. ప్రస్తుతం ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రోగ్రాం వినాయకచవితి రోజున ప్రసారం కాబోతోంది.






























