ఈ కాలంలో ప్రతి చిన్న అస్వస్థతకు మందుల షాప్ కి వెళ్లడం ఎదో ఒక బిళ్ళ వేసుకోవడం మాములు అయిపొయింది. అప్పట్లో ఇలా ప్రతి దానికి మందుల షాప్ కి పరుగులు తీసేవారు కాదు. కొన్ని కొన్ని రోగాలకు ఇంట్లోనే వైద్యం చేసుకునేవారు. అది ఇంటి వైద్యం అనుకోండి లేక సొంత వైద్యం అనుకోండి. మన ప్రకృతిలో దొరికే ఎన్నో రకాల ఫలాలు, పుష్పాలతో కొన్ని రకాల వ్యాధులు నయం చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనకి ఎంతో ఇష్టం అయిన పువ్వు మల్లె పూవు. ఆడవాళ్ళకి మల్లె పూలు అంటే మహా ఇష్టం. ఆ పూలు పెట్టుకుంటే సువాసన వెదజిల్లుతుంది. మల్లెపూలు అందానికి, వాసనకు మాత్రమే కాదు, మల్లె చాలా రోగాలకు కూడా పనిచేస్తుందన్న విషయం మీకు తెలుసా.. !!

ఇప్పుడు మల్లెపూలతో ఎన్ని రకాల ఉపయోగంలో తెలుసుకుందాం.. ! మనం పనుకుని ముందు రాత్రివేళల్లో ఓ కప్పు మల్లె టీ సేవిస్తే, సుఖ నిద్రకు పోవడానికి ఆస్కారం ఉంటుందట. నిద్ర సమయంలో ఎలాంటి కలత ఉండదని కూడా అంటారు.అంతేకాదు ముఖ్యంగా జలుబు, జ్వరం గుణాలను నివారించే శక్తి మల్లెకు ఉందట. యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియా గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. అలాగే మల్లె పూల నుంచి వచ్చే పరిమళం, గుబాళింపు అంతా ఇంతా కాదు.వాటి వాసన పిలిస్తే చాలు ఎలాంటి ఒత్తిడి అయిన ఇట్టే దూరం అవుతుంది.
ఎప్పుడన్నా ఎక్కువ పనులతో మన శరీరం అలసటకు గురి అయినట్లయితే, కొంచెం మల్లె నూనె వాసన పీలిస్తే చాలు అలసట ఆమడ దూరం పోతుందట. అలాగే ఈ మల్లె నూనె చర్మానికి తేమను అందించి, రక్షణ ఇస్తుంది. మన చర్మం పొడిబారే విధానాన్ని మల్లె నూనె నివారిస్తుంది. అంతేకాకుండా మల్లె నూనెకు చర్మం సాగె గుణాన్ని తగ్గించే గుణం ఉంది. అంతేకాకుండా చర్మంపై ఎటువంటి మచ్చలన్నాగాని తగ్గించే గుణం మల్లె నూనెకి ఉంది.

































