పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల వేళ దగ్గరపడుతున్న సమయంలో, ఈ సినిమాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సామాజిక మాధ్యమ వేదికగా X (ట్విట్టర్) ద్వారా స్పందించిన అంబటి, “పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి.. కనకవర్షం కురవాలి” అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు, ఈ ట్వీట్‌లో పవన్ కళ్యాణ్, నాగబాబును ట్యాగ్ చేయడం గమనార్హం.

సెటైరికల్ ట్వీటా? నిజమైన అభినందనా?
తరచూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ ఉండే అంబటి, అఘట్టితంగా ఇటువంటి ప్రశంసలు చేయడాన్ని నెటిజన్లు సెటైరికల్ ట్వీట్‌గా భావిస్తున్నారు. కొంతమంది ఇది నిజమైన అభినందన అని భావించగా, మరికొందరు ఇది వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్య అని విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా ప్రత్యర్థిగా వ్యవహరించే వ్యక్తి నుండి ఇలాంటి కామెంట్ రావడంపై సోషల్ మీడియాలో కలకలం రేగుతోంది.
‘హరిహర వీరమల్లు’ వివరాలు
ఇదిలా ఉంటే, హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక యోధుడిగా, చారిత్రక నేపథ్యంలోని పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా, ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నాడు. ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ప్రముఖ రాజకీయ నేతల నుంచి వస్తున్న స్పందనలు, సినిమా చుట్టూ ఉన్న పాజిటివ్ బజ్ చూస్తుంటే ఈ చిత్రం పవన్ అభిమానులకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ గారి
— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2025
"హరిహర వీర మల్లు"
సూపర్ డూపర్ హిట్టై
కనక వర్షం కురవాలని
కోరుకుంటున్నాను !@PawanKalyan @NagaBabuOffl





























