ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళగిరి పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. మంగళగిరిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా పాత పట్టణంలో కొలువైన శ్రీ సీతారామస్వామి దేవస్థానంకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు ఆలయ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోకి వెళ్లిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్బంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మంత్రి దర్శనం సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు మంత్రి వెంట ఉండి పూజల్లో పాల్గొన్నారు. మొత్తం మీద ఈ పర్యటన మంగళగిరిలో రాజకీయ, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఒకే వేదికపై తీసుకొచ్చింది.





























