Amma Rajashekhar : ‘రణం’ సినిమాతో డైరెక్టర్ గా మారిన అమ్మ రాజశేఖర్, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ వెంటనే రవితేజ హీరోగా ఖతర్నాక్ సినిమా తీసినా అది ఆశించినంత విజయం సాధించకపోవడంతో కెరీర్ గాడి తప్పింది. చాలా మంది హీరోలకు డాన్స్ కంపోజ్ చేసి హిట్ సాంగ్స్ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ డైరెక్టర్ గా అంత సక్సెస్ కాలేదు. ఇక నితిన్ తో ‘టక్కరి’ సినిమా చేసి అది డిజాస్టర్ అయి కూర్చుంది. ఇక చాలా మంది ఇండస్ట్రీ లో నన్ను మోసం చేసారంటూ ఇటీవల పాల్గొన్న పలు ఇంటర్వ్యూ ల్లో అమ్మ రాజశేఖర్ కామెంట్స్ చేసాడు.

చిరంజీవి అలా మొహం మీదే అడిగేసాడు…
రణం సక్సెస్ తో మంచి ఆఫర్లు వచ్చినా అమ్మ రాజశేఖర్ సరిగా ఉపయోగించుకోలేదు. ఇక కొన్ని సినిమాలు డిజాస్టర్లు గా మిగిలితే మరికొన్ని సినిమాలు విడుదల జాప్యం జరిగి నిర్మాతలతో గొడవలతో కొన్ని సినిమాలు నిలిచిపోయాయి. ఇక చిరంజీవి, ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చేయడానికి అంతా సిద్ధమైనా ప్రభాస్ కి కథ చెప్పడానికి వెళ్ళవసినప్పుడు వెళ్లకుండా రెండు రోజులు ఆలస్యం అవడంతో ఆది పోయింది. ఇక చిరు తో సినిమాకి అడ్వాన్స్ కూడా తీసుకుని చేయలేకపోయాడు. ఇక బిగ్ బాస్ లో పాల్గొన్న అమ్మ రాజశేఖర్ ను చిరంజీవి గెస్ట్ గా బిగ్ బాస్ కి వచ్చినపుడు పలకరించి అడ్వాన్స్ తీసుకున్నావ్ సినిమా ఎప్పుడు మాస్టర్ అని మొహం మీదే అడిగేసారట. అయితే చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉన్నా ఒక మంచి మాస్ హిట్ కొట్టిన తరువాత చిరంజీవి వంటి పెద్ద హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు అమ్మ రాజశేఖర్ చెప్పారు.

ఇక ఆర్తి అగర్వాల్ చాలా క్లోజ్ అని తాను అప్పుడు జరిగిన ఇష్యూల వల్ల, లవ్ ఫెయిల్యూర్ వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్లిందంటూ చెప్పాడు. ప్రతి విషయం ఆర్తి అగర్వాల్ నాతో షేర్ చేసుకునేది నా సినిమాకు హీరోయిన్ గా చేసినపుడు తాను మొదట సన్నగా ఉంది. ఆ తరువాత మూడు నెలలు గ్యాప్ రావడంతో బాగా లావేక్కింది. అయినా తనను సన్నగా అయిన తరువాత షూట్ చేద్దాం ఏం పర్వాలేదు అని చెపితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందరూ ఇండస్ట్రీ లో నన్ను పట్టించుకోవడం లేదు, రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అంటూ బాధ పడేది ఆర్తి అగర్వాల్.

































