Amma Rajashekhar : ‘రణం’ సినిమాతో డైరెక్టర్ గా మారిన అమ్మ రాజశేఖర్, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ వెంటనే రవితేజా హీరోగా ‘ఖతర్నా’క్ సినిమా తీసినా అది ఆశించినంత విజయం సాధించకపోవడంతో కెరీర్ గాడి తప్పింది. చాలా మంది హీరోలకు డాన్స్ కంపోజ్ చేసి హిట్ సాంగ్స్ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ డైరెక్టర్ గా అంత సక్సెస్ కాలేదు. ఎంతో మంది నన్ను ఇండస్ట్రీ లో మోసం చేసారటూ చెప్పిన అమ్మ రాజశేఖర్ ఇక తన ప్రేమ పెళ్లి విషయాలను పంచుకున్నాడు.

ప్రేమ, పెళ్లి అలా…
అమ్మ రాజశేఖర్, తెలుగమ్మాయి రాధను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారి ప్రేమ కథను అమ్మ రాజశేఖర్ పంచుకున్నాడు. ‘ఆనందం’ సినిమా కోసం పని చేస్తున్నపుడు రాధను చూసి ప్రేమలో పడ్డాను తాను సినిమా షూటింగ్ చూడడానికి వచ్చింది. అయితే ఒకమ్మాయిని చూస్తే బాగుంది, అంటూ చూస్తాం కానీ తనను చూసినపుడు ఒక ఫ్యామిలీ ఫీలింగ్ వచ్చింది, తనను లైఫ్ లో వదులుకోకూడదు అనిపించింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే తనని షూటింగ్ సమయంలో చూస్తూ ఉండేవాడిని అంటూ చెప్పాడు. ఇక ఎలాగోలా తనకి ప్రొపోజ్ చేసి ఒప్పించాను. అయితే వాళ్ళింట్లో మా పెళ్ళికి ఒప్పించడానికి కష్టపడ్డాను. రాధ వాళ్ళ అమ్మకు ఒకటే చెప్పా మీ అమ్మాయిని ఇవ్వండి పాప లాగా చూసుకుంటా అని చెప్పాను. ఇక మీ అమ్మాయి లేకపోతే దేవదాసు అవుతానని చెప్పను కానీ పెళ్లి జీవితంలో చేసుకోను అనేసరికి రాధ వాళ్ళ అమ్మకు నా విధానం నచ్చి ఒప్పుకున్నారు. ఇక రాధ తండ్రికి నేను నచ్చలేదు ఆయన ఒప్పుకోలేదు పైగా జాతకాలు కలవలేదు అని అడ్డు చెప్పారు. చివరికి పెళ్లి జరిగింది. కానీ మా పెళ్లి వల్ల మా అత్త మామ లు విడిపోయారు. నా తల్లి ఎలా చూసుకుంటారో మా అత్తగారు కూడా అలానే నన్ను చూసుకుంటున్నారు అంటూ చెప్పాడు.

ఇక ఒక అమ్మాయిని ప్రేమిస్తే ముందు ఆ అమ్మాయి తల్లిని పడేస్తే చాలు లవ్ సక్సెస్ అంటూ సరదాగా చెప్పాడు అమ్మ రాజశేఖర్. ఇక రాఘవ లారెన్స్ విషయంలో ఈర్ష్య లేదు పోటీ ఉంది. నా జూనియర్ కానీ మాస్టర్ అయ్యాడు దీంతో అందరూ నువ్వేమో అమ్మాయిల వెనుక తిరుగుతున్నావ్ వాడు చూడు మాస్టర్ అయ్యాడు అంటూ అనేవాళ్ళు. ఇక ‘సింహాద్రి లోని నువ్వు విజిలేస్తే’ సాంగ్ విషయంలో లారెన్స్ డాన్స్ స్టెప్పులు నచ్చక నన్ను చేయమన్నారు. రెండు వారాలు లారెన్స్ స్టెప్స్ చేసాడు, నేను మూడు రోజుల్లో చేసి ఇచ్చాను అలా పోటీ పడాలంటే నాకు ఇష్టం. అంతే తప్ప ఈర్ష్య లాంటివి ఏమి ఉండవు అంటూ చెప్పాడు.
































