Amma Rajashekhar : ఎన్నో హిట్ పాటలకు డాన్స్ కంపోజ్ చేసిన డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్, ఆ తరువాత రణం సినిమాతో డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ వెంటనే రవితేజ హీరోగా ఖతర్నాక్ సినిమా తీసినా అది ఆశించినంత విజయం సాధించకపోవడంతో కెరీర్ గాడి తప్పింది. చాలా మంది హీరోలకు డాన్స్ కంపోజ్ చేసి హిట్ సాంగ్స్ ఇచ్చిన అమ్మ రాజశేఖర్ డైరెక్టర్ గా అంత సక్సెస్ కాలేదు. టక్కరి అంటూ నితిన్ తో సినిమా తీసిన అదికూడా వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక తన వ్యక్తిగత జీవితలోని విశేషాలను పంచుకున్న రాజశేఖర్ తన తల్లి మరణానికి సంబంధించిన విషయాలను ఇంటర్వ్యూ లో చెప్పారు.

నా తల్లి నాకు ఆస్తి ఇస్తుందని దూరం చేసారు…
అమ్మ రాజశేఖర్ కు తమ్ముడు, ఒక అక్క ఉన్నారు. అయితే తల్లి ఎప్పుడు తనవద్దే ఉండేదట. అయితే తన చివరి రోజుల్లో ఆస్తి అందరికి సమానంగా ఇస్తాను కానీ నా సొత్తు రాజా కి ఇస్తాను అని చెప్పడంతో తమ్ముడు వాళ్ళు వారి తల్లిని మేము చూసుకుంటామని తీసుకెళ్లిపోయారట. ఇక అమ్మ రాజశేఖర్ చూడటానికి చెన్నై వెళ్లినా తన తల్లి ఎక్కడుందో తెలియనివ్వలేదట తమ్ముడు వాళ్ళు. ఇక ఫ్రెండ్, తెలిసిన వాళ్ళు అందరి సహాయంతో వెతికినా ఆమెను ఎక్కడ ఉంచారో తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారట. తన తల్లి రాజశేఖర్ గురించి అడిగితే నిన్ను చూడటానికి రాలేదు, చెప్పాము నువ్వు అడుగుతున్నావని అయినా రాలేదు అని చెప్పేవారట. పైగా తనని వారి వద్ద కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి చోట పెట్టారట. చీవరి దశలో తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన తరువాత ఆస్తి పై సంతకాలు చేయించుకున్నారని అమ్మ రాజశేఖర్ ఆరోపించాడు.

ఇక ఏదో గంభీరంగా అందరినీ గట్టి గా అరుస్తూ హుషారుగా ఉండే తనతల్లి అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితం అవ్వడం భరించలేక పోయానని బాధపడ్డారు. ఆమె చావుకి వెళ్ళకూడదని అప్పుడు వచ్చిన బంధువులు గొడవ చేస్తారు అని అనుకుంటే నా భార్య అలా వద్దు అని తల్లి చావుకు తీసుకెళ్లారట. ఇక అంత్యక్రియలు సమయమంలో అమ్మ రాజశేఖర్ తన తమ్ముడి వాళ్ళను బాగా రెచ్చ గొట్టడానికి ప్రయత్ననించారట, ఇక తన తల్లి శవం ముందు డాన్స్ వేసి ఆమెకు నివాళి ఇచ్చిన అమ్మ రాజశేఖర్ తన తల్లి ఆస్తి లో ఏదో నామ మాత్రంగా మాత్రమా్ తన వాటా ఇచ్చారని చెప్పాడు. ఇక అలా చేసిన తన తమ్ముడు ఇప్పుడు ఏ మాత్రం ఆనందంగా లేడని, మా అమ్మ నాతో ఉన్నన్ని రోజులు నేను ఆనందంగా ఉన్నాను, ఇక ఇపుడు నా భార్య పిల్లలతో ఆనందంగా ఉన్నానని అమ్మ రాజశేఖర్ చెప్పారు.



























