“30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?” సినిమాతో యాంకర్ ప్రదీప్ మాచిరాజు తో కలిసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న హీరోయిన్ అమృత అయ్యర్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రదీప్ తో కలిసి పలు టీవీ ప్రమోషన్స్ లో సందడి చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన “రెడ్” సినిమాలో నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అమృత అయ్యర్ తమిళంలో విజయ్ నటించిన “బిగిల్” లో మహిళా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించింది. రెడ్ సినిమా స్రవంతి మూవీస్ బ్యానర్ లో కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఏప్రిల్ 9 న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా రిలీజ్ డేట్ ను మార్చే అవకాశం ఉంది.

ఆకర్షణీయమైన రూపంతో అందరిని ఆకట్టుకుంటూ ఈ అమ్మడు వరుసగా ఆఫర్స్ అందుకుంటోంది. ఎప్పటికప్పుడు తెలుగుతెరకు కొత్త కొత్త కధానాయికలు పరిచయమవుతూనే ఉన్నారు. అందులో కొందరు టాప్ హీరోయిన్స్ గా చక్రం తిప్పుతున్నారు. మరి కొందరు అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వెనుకపడి ఫెడ్ అవుట్ అయిపోయిన వారు ఉన్నారు. అయితే ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ “నేను సంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబంలో సినిమాలలోకి వచ్చిన మొదటి వ్యక్తిని నేనే. సరదాగా ఒకటి రెండు సినిమాలు చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ “బిగిల్” సినిమా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అసలు తెలుగులో ఒకసినిమా చేస్తుండగా మరో సినిమా అవకాశం రావడం మెమోలు విషయం కాదు. ఇది గ్లామర్ ఫీల్డ్ అని నాకు తెలుసు. అయినా సరే నావరకు నేను మాత్రం హద్దులు దాటకుండా గ్లామర్ గా కనిపించేందుకు ప్రయత్నిస్తాను. అంతకుమించి ఎక్సపోసింగ్ నేను చేయలేను” అని చెప్తోంది.




























