రాంగోపాల్ వర్మ అంటేనే సంచలనాలు.. దీనికి కారణం అయన ఎంచుకునే కధలు… ఆల్రెడీ సంచలనం సృష్టించిన యదార్ధ గాధలను తన సినిమా కథగా ఎంచుకుని దీనిపై అందరు మాట్లాడుకునేలా చేయడం వర్మ పబ్లిసిటీ స్టన్ట్ అనే విషయం అందరికి తెలిసిన విషయమే.. అయితే తాజగా ఈ వివాదాస్పద దర్శకుడు మరో సంచలన కథను తెరకేకించే పనిలో పడ్డాడు.

అదే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘అమృత ప్రణయ్’ ల ప్రేమ ఆపై అమృత తండ్రి కిరాయి గుండాలతో ప్రణయ్ ప్రాణాలు తీయించిన సంఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మ ర్డ ర్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజగా ఫాదర్స్ డే సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల కూడా చేశారు. అయితే దీనిపై ప్రణయ్ భార్య అమృత స్పందించారు.

‘దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆ సినిమా పోస్టర్‌పై ఆమె మండిపడ్డారు. పోస్టర్ చూసిన వెంటనే తానూ చాలా డిప్రెషన్ లోకి వెళ్లానని, చాలా బాధ అనిపించిందని ఆమె అన్నారు. ఇప్పటికే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రాణయ్ ని కోల్పోయి.. ఆ తరువాత కన్నా తండ్రిని కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురవుతున్నాను. అయితే తన కొడుకుతో పాటు ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన జీవితాన్ని బ్రతకడానికి ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో తన జీవితంలోకి రామ్ గోపాల్ వర్మ రూపంలో కొత్త సమస్య వస్తుందని వాపోయారు. దీనిపై అమృత మాట్లాడుతూ… ‘వర్మ.. నువ్వు రిలీజ్ చేసిన పోస్టర్‌తో నా జీవితానికి ఎటువంటి పోలికలు లేవు. కేవలం ఒక సినిమా కోసం నువ్వు ఇంతలా దిగజారుతావని నేను అసలు అనుకోలేదు. మా పేర్లను వాడుకుని నువ్వు నీ సినిమా అమ్ముకోవాలని అనుకుంటున్నావు.. అదంతా తప్పుడు కథ. నాకు నిన్ను చూస్తుంటే జాలేస్తోంది… అయినా నీపై ఎటువంటి కేసులు వేయను. రెస్ట్ ఇన్ పీస్.. అంటూ మండిపడ్డారు అమృత.