Analist Damu Balaji : మంచు మోహన్ బాబు అనగానే క్రమశిక్షణ, సంస్కారం అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అయితే తాజాగా ఆయన కొడుకుల మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియా ఇంట రచ్చ చేస్తూ మోహన్ బాబు గారి క్రమశిక్షణ, సంస్కారం ఎక్కడికి పోయాయి అని జనాలు మాట్లాడుకుంటున్నారు. మంచు మనోజ్ తన పేస్ బుక్ ఖాతాలో విష్ణు గొడవపడుతున్న వీడియోను అప్ లోడ్ చేసారు. ఆ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవ కు కారణాలు ఏవైనా సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం బాగా ఎక్కువయ్యాయంటు ఆ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు విశ్లేషించారు.

ట్రోలర్స్ కి మంచి స్టఫ్ దొరికింది….
మంచు ఫ్యామిలీ మామూలుగానే ట్రోలర్స్ కి , మీమీర్స్ కి మేత అందిస్తుంటుంటారు. ఇక ఇప్పుడు అన్నదమ్ముల గొడవతో మంచి స్టఫ్ అందించారు అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. ఎవరి కుటుంబంలో అయిన గొడవలు అభిప్రాయ బేధాలు కామన్ కానీ వాటిని బయటపెట్టుకుంటే ఇలానే పలుచన అవుతారు అంటూ అభిప్రాయపడ్డారు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మోహన్ బాబు గారు మాట్లాడుతూ ట్రోల్స్ గురించి మాట్లాడుతూ ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి అంటూ చాలా చులకనగా మాట్లాడారు. అలా చులకనగా మాట్లాడుతారు కాబట్టే వాళ్ళ ఫ్యామిలీ ట్రోలర్స్ భారిన పడుతోంది అంటూ చెప్పారు. ఇపుడిక మనోజ్ ఏకంగా వాళ్ళింట్లో గొడవను రోడ్లో పెట్టేసాడు అందుకే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఇష్యూ గురించే చర్చ జరుగుతోంది అంటూ చెప్పారు.






























