Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి పరిస్థితి ప్రస్తుతం ఘోరంగా ఉంది. మొదటి నుండి వివేకానంద రెడ్డిని నమ్ముకుని బతికిన ఎర్ర గంగిరెడ్డి ఆయన హత్య కేసులోనే జైలులో ఉన్నాడు. అయితే జైలులో కూడా వివేకానంద రెడ్డి వ్యతిరేక వర్గంతో ఉండాల్సి రావడంతో మరింత ఇబ్బంది పడుతున్నాడు. జైలులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఎర్ర గంగి రెడ్డి మీద చేయి చేసుకున్నట్లు కథనాలు వినిపిస్తున్న నేపధ్యంలో అసలేం జరుగుతోంది వంటి ఆసక్తికర అంశాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

ఎర్ర గంగిరెడ్డి తో మూలాఖాత్ అయింది ఎవరంటే…
బెయిల్ రద్దయ్యాక జైలులో ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఆయనతో పాటు అదే జైలులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తో కలిసి ఉంటున్నారు. తాజాగా దస్తగిరితో మూలాఖత్ అయిన ఎర్ర గంగిరెడ్డి కి దస్తగిరి అప్రూవర్ గా మారిపో అని సలహా ఇచ్చాడట. దీంతో భాస్కర్ రెడ్డి అప్రూవర్ గా మారి ఎవరిని ఇరికిస్తాడో అన్న భయంతో ఎర్ర గంగిరెడ్డి మీదకి గ్లాస్ విసిరినట్లు బయటికి లీక్ అయిందని బాలాజీ అభిప్రాయపడ్డారు.

దస్తగిరి చేత సిబిఐ ఇలా ఎర్ర గంగిరెడ్డిని అప్రూవర్ అవ్వమని చెప్పిస్తోందని అనలిస్ట్ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక దస్తగిరిని ఇంటర్వ్యూ చేయడానికి ఆర్ఙివి ప్రయత్నిస్తుండగా దస్తగిరి మాత్రం అతను ఎలాంటి ప్రశ్నలు వేస్తాడో, లేని పోనీ సమస్యలు ఎందుకు అన్నట్లుగా అర్జీవీ ఇంటర్వ్యూని తిరస్కరించినట్లు తెలుస్తోందని బాలాజీ తెలిపారు. ఇక కేసులో ఎర్ర గంగిరెడ్డి అప్రూవర్ గా మారితే భారతి రెడ్డి దాకా కేసు వెళ్ళొచ్చనే అంచనాలు ఉందంటూ బాలాజీ విశ్లేషించారు.