Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లోకి కొత్త పార్టీ వచ్చింది. నిన్న నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో భారీ బహిరంగ సభ ద్వారా భారత చైతన్య యువజన పార్టీ పేరుతో రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి పార్టీ పెట్టారు. ఈ సభకు అంబెడ్కర్ మనవడు, అలాగే మండల్ కమిషన్ బీసీ మండల్ మనవడు హాజరయ్యారు. జనసమీకరణ కూడా రామచంద్ర యాదవ్ బాగా చేయగా ఈ పార్టీ గురించి అసలు ఈ పార్టీ వెనుకున్న వ్యక్తులు ఎవరు అన్న దాని గురించి అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషించారు.

రామచంద్ర యాదవ్ వెనుక ఉన్నది ఆ పార్టీనే…
చిత్తూరు జిల్లా పుంగనూరుకి చెందిన రామ చంద్ర యాదవ్ చెన్నై లో ఎంబిఏ చేసి ఆపైన పలు వ్యాపారాలు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన ఏమి వ్యాపారం చేసారో ఇప్పటికీ క్లారిటీ లేదంటూ బాలాజీ తెలిపారు. కానీ ఆయనకు కోట్ల ఆస్తులు ఉన్నాయని పుంగనూరులో ఇల్లే పది కోట్లు పెట్టి కట్టినట్లుగా తెలుస్తోందని బాలాజీ తెలిపారు. గత ఎన్నికలలో జనసేన తరుపున పోటీ చెసినా గెలవలేదు.

కానీ జనసేన ఓటింగ్ శాతంలో ఆయనకు ఎక్కువ ఓటింగ్ శాతం ఉంది అంటూ బాలాజీ తెలిపారు. అయితే ఎన్నికలయ్యాక ఆయన జనసేన నుండి బయటికి వచ్చారు. ఈ మధ్యనే అమిత్ షా ని కలిశారు. అంత తేలిగ్గా ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా ఇతనికి ఇవ్వడం, వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించారు. ఇక ఇతనికి రామ్ దేవ్ బాబా, అలాగే పలువురు మఠాదిపతులతో మంచి సంబంధాలు ఉన్నాయని బాలాజీ తెలిపారు. దీనివల్లే బీజేపీ ఏపీలో వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని ఇతని చేత పార్టీ పెట్టించినట్లుగా భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ నే బీసీ ఓట్లు చీల్చడానికి ఇతని చేత ఆ పార్టీ పెట్టించ్చునట్లుగా మరికొంతంది అభిప్రాయపడుతున్నారని బాలాజీ తెలిపారు.