Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో హీట్ మొదలయింది. వాతావరణం చల్లబడినా రాజకీయ వేడి మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ముందస్తు ఎన్నికలు అంటూ ఒక వైపు ప్రచారం జరుగుతుండగా తాజాగా సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో ఆంతర్యం ఏమైయ్యుంటుందని చర్చలు మొదలయ్యాయి. దీని గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ముందస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్…
జగన్ మోహన్ రెడ్డి, అటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీలకు షాక్ ఇస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహంతో ఉన్నారని అనలిస్ట్ బాలాజీ తెలిపారు. అందుకే ఢిల్లీ టూర్ లో మోడీ, అమిత్ షా ను కలిసి ఈ విషయంలో అనుమతి తెచ్చుకున్నారని చెప్పారు. అయితే వైసీపీ నేత మిథున్ రెడ్డి మాత్రం ఆ వార్తలో నిజం లేదని జగన్ ఢిల్లీ టూర్ కేవలం రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించే అంటూ చెప్పారు.

జగన్ మోడీ ని కలిసి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధిచిన నిధులను అడిగి అలానే ముందస్తు ఎన్నికల ప్రపోసల్ పెట్టినట్లు తెలుస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు. సర్వేలు జగన్ కు అనుకూలంగా ఉండటం వల్ల జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి బీజేపీ నెగెటివటి ప్రభావం నుండి పక్కకు రావాలని భావిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే బీజేపీ వ్యతిరేకత జగన్ మీద ప్రభావం చూపుతుందని, మొదట అసెంబ్లీ ఎన్నికలు అయిపోతే ఆ పైన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కి మద్దతు ఇవ్వచ్చన్నది జగన్ వ్యూహం అంటూ చెప్పారు.


































