Analyst Damu Balaji : జబర్దస్త్ నుండి ఎదిగిన కమెడియన్ హైపర్ ఆది కి పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆది జబర్దస్త్ పుణ్యమా అని నేమ్ ఫేమ్ ఆస్తులు సంపాదించుకుని కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆది తన పంచ్ డైలాగులకు జబర్దస్త్ లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇదంతా గతం అనలేమో. ఎందుకంటే మొదట్లో ఆది పంచ్ డైలాగులు ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకునేలా ఉండేవి. ఇక ఆది కెరీర్ అటు జబర్దస్త్ ఇటు ఢీ షో అంటూ మరో వైపు శ్రీద్దేవి డ్రామా కంపెనీ అంటూ ఇలా చేతి నిండా సంపాదిస్తున్నాడు. అయితే ఇప్పుడు పాలిటిక్స్ వైపు చూస్తున్నాడు ఆది. తాజాగా ఎమ్మెల్యే గా ఆది పోటీ చేస్తాడనే వార్తలను గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జనసేన నుండి ఎమ్మెల్యే గా ఆది…
జబర్దస్త్ లో పంచ్ లతో ఆకట్టుకున్న ఆది, ఆ షోలో మెగా అభిమానులకు అలానే నాగబాబు కి బాగా చేరువయ్యాడు. అలా నాగబాబుతో ఉన్న సన్నిహిత్యంతోనే ముందు ఎన్నికలలో జనసేన తరపున ప్రచారం చేసాడు. ఇక హరి హార వీర మల్లు సినిమాలో నటిస్తున్న ఆది ఆ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ కు బాగా దగ్గరయ్యాడు.

అధినేతతో అరగంట మాట్లాడి మాటలతో ఆకట్టుకునేసాడు. అలా పవన్ కళ్యాణ్ కి దగ్గరైన ఆది వచ్చే ఎన్నికలలో ఏపీ లో ఎమ్మెల్యే సీటుకి పోటీ చేస్తాడు అనే వార్తలు వినిపిస్తున్నాయంటూ బాలాజీ మాట్లాడారు. అయితే కమెడియన్ గా మొదలయిన ఆది పంచులు బాగా పేలుతాయి కానీ అవి ఓట్లుగా మారడం కష్టం అంటూ జనసేన కార్యకర్తలు భావిస్తున్నాడటం వల్ల జనసేన నుండే ఆది అభ్యర్థిత్వానికి వ్యతిరేకత మొదలయిందనే కథనాలు వినిపిస్తున్నాయని బాలాజీ అభిప్రాయాపడ్డారు. ఏ నియోజకవర్గం ఇచ్చినా ఓట్లుగా తన మాటలను మలిచే శక్తి ఆదికి లేకపోవచ్చని బాలాజీ అభిప్రాయపడ్డారు.