Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి కేసులో పూటకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ డైలీ సీరియల్ ను తలపిస్తుండగా తాజాగా జైలులో రిమాండ్ లో ఉన్న భాస్కర్ రెడ్డి గది జైలులో మార్చాలని కోర్టుకి పిటిషన్ వేశారు. ఎందుకని ఆయన ఎర్ర గంగి రెడ్డి తదితరులతో కలిసి ఉండలేక పోతున్నారు, హాస్పిటల్ లో ఉన్న ఆయన మళ్ళీ జైలుకి తరలించడం వెనుక ఏం జరిగింది వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నేను ఆ గదిలో ఉండలేను…
భాస్కర్ రెడ్డిగారు వృధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటోవలే హాస్పిటల్ లో చేరిన ఆయనను కోలుకున్నాక మళ్ళీ జైలుకు తరలించడం జరిగింది అంటూ అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. ఇక అయన ప్రస్తుతం ఎర్ర గంగి రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి వంటి వారితో కలిసి ఒకే గదిలో ఉండగా ఆయన కింద పడుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

అందుకే కోర్ట్ ను ఆయనకు విడిగా గది అలాగే బెడ్ ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే కోర్ట్ ఈ విషయంలో ఎలా స్పందిస్తోందో వేచి చూడాల్సి వుంది అంటూ అనలిస్ట్ బాలాజీ అభిప్రాయపడ్డారు. మరో వైపు ఎర్ర గంగిరెడ్డి టార్చర్ భరించలేకనే ఆయన మరో రూమ్ కావాలని అడుగుతున్నారనే కథనాలు వినిపిస్తున్నాయంటూ అనలిస్ట్ బాలాజీ తెలిపారు.