Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో పూటకో వార్త బయటికి వస్తున్నా అసలు నిందితులు బయటికి రావడం లేదు. అయితే సిబిఐ కావాలనే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటూ ఒకవైపు వినిపిస్తున్నా విచారణకు అవినాష్ రెడ్డి హాజరువ్వాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తరలించడం, ఆ కారణంతో సిబిఐ విచారణకు గడువు కోరడంతో అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకోడానికి కావాలనే ఇలా చేస్తున్నడంటూ విపక్షాలు విమర్శిస్తుంటే మరోవైపు వైఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉందని వైఎస్ కుటుంబ నుండి విజయమ్మ పరామర్శించగా తాజాగా వైఎస్ వివేకానంద చెల్లెలు విమలా రెడ్డి కూడా పరామర్శించారు. ఇక ఆమె మీడియా ముందు మాట్లాడిన విషయాలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నా కోడలు ఇలా ఎందుకు చేస్తోందో…
వైఎస్ విమలా రెడ్డి అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మీని పరామర్శించాడానికి వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలను చేసారు. నిజానికి అంతకుముందు వైఎస్ విజయమ్మ కూడా పరామర్శించినా ఆమె మీడియా ముందు మాట్లాడలేదు కానీ విమలా రెడ్డి మాట్లాడారు. అవినాష్ రెడ్డి ని చిన్నప్పటి నుండి చూస్తున్నామని తాను చాలా సున్నితమైన అబ్బాయి ఇలాంటి హత్యలు వంటివి చేసే రకం కాదని చెప్పారు. అలాగే సునీత రెడ్డి గురించి మాట్లాడుతూ సునీత ఇలా చేస్తుందని అనుకోలేదు.

మొదట్లో సునీత ఇది బయటి వ్యక్తుల పని అనిచెప్పి మళ్ళీ మాట మర్చింది, కొంతమంది దుష్ట వ్యక్తుల ప్రమేయం ఇందులో ఉంది అంటూ చెప్పారు. విమలా రెడ్డి అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేయడం విజయమ్మ కూడా రావడం చూస్తుంటే అవినాష్ రెడ్డి కి ఇంట బయట మద్దతు పెరుగుతోందని తెలుస్తోందంటూ చెప్పారు బాలాజీ. కొందరు వ్యక్తులు దిగజారి అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా జనాల్లో ఆయనకు మద్దతు లభిస్తోందని చెప్పారు.