Analyst Damu Balaji : పుట్టపర్తి ఆశ్రమంలో ముదిరిన గే కల్చర్… అప్పట్లో అబ్బాయిల మీద లైంగిక దాడులు…: అనలిస్ట్ దాము బాలాజీ

0
195

Analyst Damu Balaji : అనంతపురం జిల్లా పుట్టపర్తి అనగానే సత్య సాయి బాబా గుర్తొస్తాడు. కొన్ని లక్షల విదేశీ, స్వదేశీ భక్తులు ఆయనకు ఉన్నారు. ఇండియా లోనే కాకుండా ఇతర దేశాల నుండి ఆయన కోసం ఇప్పటికీ భక్తులు వస్తూ ఆయన ఆశ్రమం దర్శిస్తుంటారు. ఇక పుట్టపర్తిలో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్, విద్యా వైద్య సపదుపయాలను అందరికీ అందిస్తూ బాబా లేకపోయినా ఇప్పటికీ ఆ సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఇక సత్య సాయి బాబా 1926లో జన్మించగా చిన్నతనంలో తేలు కుట్టి మూడు రోజులు లేవలేక పోయాడట. ఆ తరువాత ఆయనలో మార్పులు కనిపించాయని సంస్కృత శ్లోకాలు పలకడం మొదలు పెట్టి వింత ప్రవర్తన చూపించడం, ఆ తరువాత తాను షిరిడి సాయి అవతారం అని చెప్పడం జరిగిందని అనలిస్ట్ బాలాజీ తెలిపారు.

పుట్టపర్తి ఆశ్రమంలో లైంగిక దాడులు…

సత్య సాయి బాబా జీవించి ఉన్నపుడు ఆశ్రమం రోజు భక్తులతో కళకళలాడుతూ ఉండేది. అయితే 93లో జరిగిన కాల్పుల సంఘటన తరువాత విదేశీ భక్తుల్లో ఒక డెన్మార్క్ కి చెందిన భక్తుడు ఆశ్రమంలో టీనేజ్ అబ్బాయిల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయని అక్కడ చిన్నారులకు మగవారికి రక్షణ లేదంటూ కథనాలు రాయడం కలకలం రేపిందని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

అయితే అప్పట్లో యూనేస్కో కూడా పుట్టపర్తి ఆశ్రమంతో భాగస్వామిగా కార్యక్రమాలను చెప్పట్టాలని తొలుత భావించినా చిన్నారుల మీద లైంగిక దాడుల ఆరోపణలతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. డెన్మార్క్ అలాగే బ్రిటిష్ ప్రభుత్వాలు కూడా పుట్టపర్తి వెళ్లే వారి దేశస్థులకు విజ్ఞప్తులను కూడా అప్పట్లో చేసేవి. అక్కడికి వెళితే చిన్నారులను ఒంటరిగా వదలకండి అంటూ హెచ్చరించాయి. ఇలాంటి ఆరోపణలు వచ్చనా ఇండియన్ ప్రభుత్వం ఆయన మీద ఎలాంటి విచారణ కమిటీ వేయలేదు అంటూ అనలిస్ట్ బాలాజీ తెలిపారు.