Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో టీడీపీ పార్టీకి సినిమా ఇండస్ట్రీకి ముందు నుండి మంచి అనుబంధం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంకి చెందిన వారు కావడం అన్న గారి పిలుపు వల్ల ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్నారు. అలా ఆ పార్టీకి ఇండస్ట్రీ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక వైసీపీ పార్టీ మాత్రం సినిమా ఇండస్ట్రీని దూరంగానే పెట్టింది. పోసాని, ఆలీ, ఆర్జివి వంటి వారు తప్పితే పెద్దగా ఇండస్ట్రీ వాళ్ళేవరు వైసిపిపార్టీలో కనిపించరు. జగన్ కూడ పెద్దగా సినిమా గ్లామర్ ను పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు మంచు మోహన్ బాబు మాత్రం బంధుత్వం వల్ల వైసీపీ కి మద్దతు ఇచ్చారు. అయితే ఇపుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వైసీపీ లో చేరుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

వైసీపీ కండువా కప్పుకోనున్న మహేష్….
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం కి రాజశేఖర్ రెడ్డికి మంచి అనుబంధం ఉంది. అందువల్లె మహేష్ బాబు కూడా వైసీపీ కి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుందని బాలాజీ అభిప్రాయపడ్డారు. కృష్ణ గారు టీడీపీ వ్యతిరేకి ఆయన కాంగ్రెస్ కి సపోర్ట్ చేసారు. అలాగే వైస్సార్ కి మంచి స్నేహితుడు ఆ పరిచయలే జగన్ అలాగే మహేష్ కి కూడా ఉన్నాయి అంటూ అభిప్రాయపడ్డారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వచ్చాక జగన్ కూడా సినిమా గ్లామర్ ను వాడుకోవాలని అనుకుంటున్నారు. అందుకే మహేష్ బాబు తో ఇటీవల భేటీ అయినట్లు కథనాలు వస్తున్నాయని తెలిపారు.

అయితే మహేష్ బాబు రాజకీయాల్లోకి వచ్చి రాజకియంగా ఎదగాలనే ఆలోచన లేదు. ఆయనకు సామజిక సేవ అంటే చాలా ఇష్టం తన సంపాదన లో 30% సేవాకార్యక్రమాలకు ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు రాజకీయాల్లో ఉండటం మరింత తోడ్పడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు గారి బాబాయ్ ఆది శేషగిరి రావు గారు జగన్ తో సన్నిహితంగా ఉండేవారు. అయితే విజయవాడ పార్లమెంట్ సీటు అడిగితే ఇవ్వలేదనే కోపంతో టీడీపీ లో చేరినట్లు బాలాజీ తెలిపారు. ఇప్ప్పటికి జగన్ తో మంచి అనుబంధం ఉందని ఆదిశేషగిరి రావు చెబుతారు అంటూ బాలాజీ తెలిపారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవర్ స్టార్ ను ఎదుర్కొనడానికి సూపర్ స్టార్ ను రంగంలోకి వైసీపీ దించుతోంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాబోవు ఎన్నికలు గ్లామరస్ గా ఉండనున్నాయి.