Analyst Damu Balaji : ఈనాడు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓనర్ అయిన రామోజీ రావు గారి మీద సిఐడి విచారణ జరగడం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 లో కేసు వేయగా ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో ఆ కేసు విచారణ జరుగుతోంది. సిఐడి రామోజీ రావు గారిని తన ఇంట్లోనే సుమారు ఐదు గంటల పాటు ప్రశ్నించిన ఆయన విచారణలో పెద్దగా సమాధానాలు చెప్పలేదని బయటికి వినిపించింది. అయితే సిఐడి విచారణకు హాజరవుతున్నారు అనే సమయానికి అనారోగ్య కారణాలతో మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ఇంట్లో ఆయన పడుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బాగా అప్పట్లో వైరల్ అయ్యాయి . ఇప్పుడు మరోసారి మార్గదర్శి సంస్థల్లో సిఐడి సోదాలు నిర్వహించడం చర్చకు దారి తీయగా ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

మార్గదర్శి లో కుంభ కోణం…. నల్లదనం దాచుకుంటున్న టీడీపీ…
సిఐడి అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి బ్రాంచులలో తనిఖిలను నిర్వహించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. మార్గదర్శి సంస్థల్లో నల్లధనం దాచుకోడానికి మంచి వెసులుబాటు ఉందని కోటి రూపాయలకి పైగా డబ్బు దాచుకునేవారు చాలా మంది ఉన్నారాని వాళ్లలో చాలా మంది టీడీపీ వాళ్లంటూ తెలిపారు. బ్యాంకు కంటే తక్కువ వడ్డీ కే అయినా డబ్బు అందులో పెట్టడానికి కారణం ఎలా డబ్బు సంపాదించారు, వంటి విషయాలు మార్గదర్శి లో అడగకపోవడం వల్ల నల్లధనం దాచుకుంటున్నారని సీఐడి అధికారులు చెప్తున్నారు.

ఇక 50000 మంది చందాదారులకు మార్గదర్శి డబ్బు ఇవ్వాల్సి ఉన్నా ఇప్ప్పటికి ఇవ్వలేదని చిట్ ఫండ్ రూల్స్ ప్రకారం చిట్ ఫండ్ కంపెనీ లోని డబ్బులు జనాల నుండి సేకరించినవి లోకల్ బ్యాంకులో జమ చేయాలి కానీ మార్గదర్శి తన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ కు ఇక్కడి శాఖలా నుండి డబ్బు పంపి ఆ డబ్బును వేరే వ్యాపారాలలోకి మళ్లీస్తోంది. అందుకే ఇపడూ చందా దారులకు కట్టడానికి డబ్బు మార్గదర్శిలో లేదు అంటూ సీఐడి చెప్తోందని బాలాజీ తెలిపారు.