Analyst Damu Balaji : సినిమాల్లో హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది రోజా. అన్ని భాషల్లోనూ హీరోయిన్ గా నటించింది. ఇక పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రోజా అటు బుల్లితెర మీద అదరగొట్టింది. మోడరన్ మహలక్ష్మి తో మొదలు పెట్టి జబర్దస్త్ తో మరోసారి మంచి ఫామ్ లోకి వచ్చింది. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటు జబర్దస్త్ షో చేస్తూ ఉండే రోజా పాలిటిక్స్ లో మొదట టీడీపీతో మొదలు పెట్టి ఆ తరువాత వైసీపీ లోకి వెళ్లి ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే గా ఉంటూ అలానే మంత్రిగా జగన్ కేబినెట్ లో కొనసాగుతున్నారు. అయితే తాజాగా రోజా ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనుందని వినిపిస్తోంది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

తమిళ రాజకీయాల వైపు రోజా…
నగరి నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న రోజా నెక్స్ట్ ఏపీ రాజకీయాలకు బై చెప్పేస్తోందని ప్రచారం జరుగుతోందని బాలాజీ తెలిపారు. రోజా నగరి నియోజకవర్గం నుండి రెండు సార్లు అరకొర మెజారిటీతోనే గెలిచిందని ఇక మూడో సారి గెలుపు కష్టమే అని, సొంత క్యాడర్ లోనే అసంతృప్తి కనిపిస్తోందని బాలాజీ తెలిపారు.

ఇక చిత్తూర్ లో వైసీపీ నేతల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట జగన్ వద్ద చెల్లుబాటు అవుతుందని, ఆయనకు రోజా కు పడదని అందుకే రోజాకు నెక్స్ట్ సీటు కష్టమే అనే మాటలు వినిపిస్తున్నాయని బాలాజీ తెలిపారు. ఇక రోజా భర్త సెల్వమని తమిళనాడు చెంగల్ పట్టుకు చెందిన వారు. ఆయన తమిళ డైరెక్టర్ అలాగే దక్షిణ చిత్ర పరిశ్రమ ఫెడరేషన్ లో కీలకంగా ఉన్నారు. అందుకే తమిళ రాజకీయాల వైపు రోజా వెళ్ళనున్నట్లు స్టాలిన్ నాయకత్వంలో పనిచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయని బాలాజీ తెలిపారు.