Analyst Damu Balaji : మంచు మోహన్ బాబు అనగానే క్రమశిక్షణ, సంస్కారం అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అయితే తాజాగా ఆయన కొడుకుల మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియా ఇంట రచ్చ చేస్తూ మోహన్ బాబు గారి క్రమశిక్షణ, సంస్కారం ఎక్కడికి పోయాయి అని జనాలు మాట్లాడుకుంటున్నారు. తాజాగా మంచు మనోజ్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక వీడియోను అప్ లోడ్ చేసారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవ, ఆ మంచు తుఫాన్ కి కారణం ఏమిటి అన్న విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు విశ్లేషించారు.

మనోజ్ కొడుకు కాదు ఆస్తి ఇవ్వం…
మంచు మనోజ్, విష్ణు ల మధ్య గొడవలకు కారణాలు ముఖ్యంగా ఆస్తి విషయంలో అంటూ పెద్ధ చర్చ నడుస్తున్న నేపథ్యంలో అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ ఆస్తుల విషయంలో గొడవ ఉంది అని బయట వినిపిస్తున్నా విష్ణు కి మనోజ్ రెండో పెళ్లి నచ్చకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది అంటూ అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు ఉన్నా విబేధాలు పెళ్లి తరువాత పెద్దవి అయ్యాయి.

ఆస్తి విషయంలో కూడా మౌనిక రెడ్డి కొడుకు మనోజ్ కొడుకు ఎలా అవుతాడు ఆస్తి ఇవ్వం అంటూ వాదనలు వచ్చాయని దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక ఆస్తి విషయంలో మోహన్ బాబు గారు సమంగా అందరికీ పంచినట్లు సన్నిహితుల ద్వారా తెలుసుతున్నా విష్ణు కుటుంబం వైపు నుండి మనోజ్ రెండో పెళ్లి ఇష్టం లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.