Analyst Damu Balaji : వివేకానంద కేసులో ట్విస్ట్… సిబిఐ ఛార్జ్ షీట్ ను వెనక్కి పంపిన కోర్ట్…: అనలిస్ట్ దాము బాలాజీ

0
363

Analyst Damu Balaji : వివేకానంద హత్య కేసు అనేక మలుపులు తిరిగి మళ్ళీ అవినాష్ రెడ్డి అరెస్టు దగ్గరే ఆగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానంద ను హత్య చేయించారని ఈ కేసులో మొదటి నుండి ఆయనను అరెస్టు చేయాలని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి కోరుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండగా తాజాగా సుప్రీం కోర్ట్ ను సునీత్ రెడ్డి ఆశ్రయించారు.

హై కోర్ట్ కి వెళ్లమన్న సుప్రీం కోర్ట్…

వివేకానంద హత్య తరువాత ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని సునీత కేసును సిబిఐ కి అప్పగించాలని కోరగా అలాగే ఏపీ హై కోర్ట్ నుండి కేసును తెలంగాణ హై కోర్ట్ కి కేసు బదిలీ చేయించుకున్న సునీత ప్రస్తుతం అక్కడ నుండి సుప్రీం తలుపు తట్టారు.

అయితే సుప్రీం కోర్ట్ కేసును ఆల్రెడీ హై కోర్ట్ చూస్తున్నందున కల్పించుకోమని చెప్పగా సునీత తరుపున లాయర్లు సుప్రీం కోర్ట్ విచారించాలని కోరారు. అయితే సుప్రీం కోర్ట్ మాత్రం కేసులో నిందితులు, బాధితులు ఎవరన్నది తేల్చలేమని, మొదటి నుండి ఈ కేసును హై కోర్ట్ చూస్తున్నందున వాళ్ళకే అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇక కేసులో ఇప్పటి వరకు తెలియని విషయం సిబిఐ కోర్ట్ లో సిబిఐ అధికారులు తెలిపారు. అదే సిబిఐ కోర్ట్ లో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను తిరిగి వెనక్కి పంపడం.