Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్యకు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి సంబంధం ఏమిటి…: అనలిస్ట్ దాము బాలాజీ

0
171

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ నిందితులుగా పేర్కొన్న వారిలో దస్తగిరి అప్రూవర్ గా మారగా మిగిలిన వారిలో ఎర్ర గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే వీరిలో ఏ6 గా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రి ప్రకాష్ రెడ్డిని తీసుకువచ్చి వివేకానంద హత్య జరిగాక బ్యాండేజ్ వేయించాడు అనే ఆరోపణల నడుమ అరెస్టు అయ్యాడు. ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాష్ రెడ్డి వైఎస్ భారతి రెడ్డి తండ్రి హాస్పిటల్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు. హత్య తరువాత సాక్ష్యాలు మాయం చేసే దిశగా రక్తాన్ని భాస్కర్ రెడ్డి క్లీన్ చేయించారు అనే ఆరోపణలు ఉండగా తలకు తగిలిన గాయాన్ని బ్యాండేజ్ తో కవర్ చేయడానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రిని తీసుకువచ్చారు అనేది ఆరోపణ. ఇక ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను తెలిపారు.

ఉదయ్ కుమార్ రెడ్డిని ఎందుకు సిబిఐ టార్గెట్ చేసింది…

గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి యురేనియం ఫ్యాక్టరీలో ఉద్యోగిగా ఉంటున్నారు, ఆయన తండ్రి హాస్పిటల్ లో కాంపౌండర్ గా ఉన్నారు. ఉదయ్ కుమార్ తండ్రిని తీసుకువచ్చి వివేకానంద తలకు బ్యాండేజ్ వేయించాడు. అయితే వివేకానంద మరణించిన రోజు ఉదయ్ కుమార్ ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. కానీ సిబిఐ తో వెళ్లానని అపద్ధం చెప్పారు. అంతేకాకుండా ఫ్యాక్టరీకి రాకుండానే అక్కడ వచ్చినట్లు అటెండెన్స్ ఉంది.

ఇక గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఉదయ్ కుమార్ ట్రేస్ చేసినపుడు వివేకానంద హత్య రోజు రాత్రి ముడుగంటల ప్రాంతంలో బయటికి వచ్చినట్లు తెలుస్తోంది అంటూ బాలాజీ సిబిఐ విచారణకు సంబంధిచిన అంశాలను తెలిపారు. అయితే కేసులో మరిన్ని వివరాలను సేకరించడానికే ఉదయ్ కుమార్ బెయిల్ కి అప్లై చేస్తున్న సిబిఐ ఇవ్వకూడదు అంటూ కోర్టులో కోరుతోంది అని తెలిపారు.