Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి కేసులో పూటకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ డైలీ సీరియల్ ను తలపిస్తుండగా తాజాగా జైలులో రిమాండ్ లో ఉన్న భాస్కర్ రెడ్డి జైలులో గది మార్చాలని కోర్టుకి పిటిషన్ వేశారు. హాస్పిటల్ లో ఉన్న ఆయనను మళ్ళీ జైలుకి తరలించడంతో అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రెడ్డి గారు తాజాగా బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఇక ఈ ఇష్యూకి సంబంధించిన విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

భాస్కర్ రెడ్డి కి బెయిల్…
వివేకానంద రెడ్డి హత్య కేసుతో సంబంధం ఉంది అనే కారణంతో సిబిఐ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిపై ఐపీసీ 120బీ, 302, 201 సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, వెన్నెముక సర్జరీ ఫెయిల్ అవడం వల్ల కింద పడుకోలేనని, సిబిఐ వేసిన మొదటి రెండు ఛార్జిషీట్స్ లలో తన పేరు లేదని కావాలనే నన్ను ఇంటికించాలని తరువాత నా పేరు చేర్చి అరెస్టు చేసారని, బెయిల్ ఇవ్వవలసిందిగా బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయగా హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.

భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై స్పందించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోరింది. సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు డిఫెన్స్ న్యాయవాది ఇద్దరూ రేపు జూన్ 6న తమ వాదనలను సమర్పించనున్నారు అంటూ బాలాజీ తెలిపారు. ఇక సిబిఐ న్యాయవాదులతో కలిసి తన న్యాయవాదులు కలిసి పనిచేసుకునేందుకు వీలు కల్పించాలని సునీత రెడ్డి కోర్టుని అభ్యర్థించారని బాలాజీ తెలిపారు. సిబిఐ న్యాయవాధులకు తమ లాయర్లు సహాయం చేస్తారని అలాగే తాము ఇక్కడి వారే కావడం వల్ల సాక్షుల విషయంలో సహాయ పడగలమని చెప్పారు.