Analyst Damu Balaji : వైజాగ్ శ్వేత ఆత్మహత్య కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్… ఫోన్ లో శ్వేతను బెదిరించింది వాళ్ళే…: అనలిస్ట్ దాము బాలాజీ

0
726

Analyst Damu Balaji : వైజాగ్ శ్వేత ఆత్మహత్య కేసులో ఇప్పటికే ఆమె అత్తింటి వారు జైలులో రిమాండ్ లో ఉన్నా కేసు మాత్రం నత్తనడకన సాగుతోంది. పోలీసులు ఇదో అనుమానాస్పద మృతి కాదు ఆత్మహత్య అని క్లారిటీ గా చెబుతున్నా ప్రస్తుతం శ్వేత ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రమే క్లారిటీ గా ఆ విషయాన్ని ధ్రువీకరించాలి. అయితే రిపోర్ట్ ఆఫీషియల్ గా బయటికి రాకపోయినా లీకులు మాత్రం వినిపిస్తున్నాయి. ఇక శ్వేత కేసులో అసలేం జరుగుతోంది అనే విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఆ బట్టలు ఆమెవి కాదు.. వెళ్లి బెదిరించారు…

దాము బాలాజీ శ్వేత కేసు గురించి మాట్లాడుతూ ఫోరెన్సిక్ నుండి వచ్చిన లీక్ బట్టి శ్వేత బట్టలుగా భావిస్తున్న బట్టలు ఆమెవి కాదు అని తెలిపారు. శ్వేత డెడ్ బాడీతో పాటు దొరికిన లో దుస్తుల డిఎన్ఏ ఆమె డిఎన్ఏ తో మ్యాచ్ కాలేదని తెలిపారు. అయితే పూర్తిగా క్లారిటీ ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటికి వచ్చాక తెలుస్తుంది.

ఇక ఫోన్ లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడాలి అంటూ తెలిపారు. శ్వేత కేసులో ఫోన్ ఆధారాలే కీలకం కానున్నాయి. కేసులో శ్వేత తల్లి ఎంత పోరాడినా ఈ కేసు నిలబడదు, అక్కడ శ్వేత అత్తింటి వారికి బాగా పలుకుబడి డబ్బు ఉన్న కారణంగా మీడియా ఫోకస్ ఉన్నంత వరకు ఈ కేసు కనిపిస్తుంది ఆపైన శిక్ష పడకపోవచ్చు అంటూ బాలాజీ తెలిపారు. శ్వేత ను ఎవరైనా బెదిరించారా, ఆత్మహత్య కు ప్రేరేపించారా వంటివి ఫోన్ ద్వారా తెలియవచ్చు. అలాగే ఆమెని లైంగికంగా ఆమె ఆడపడుచు భర్త వేధించాడని శ్వేత తల్లి ఆరోపణల్లో నిజానిజాలు ఫోన్ ద్వారా తెలియవచ్చు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.