Analyst Damu Balaji : సిబిఐ విచారణకు రాకుండా అవినాష్ రెడ్డి ని ఆపిందెవరు…: అనలిస్ట్ దాము బాలాజీ

0
66

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా చంపింది ఎవరనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎం కి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలయక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్ ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్నా విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ మరోసారి పిలవడం, అవినాష్ రాలేనని చెప్పడం వంటి ఆసక్తికర సంఘటనల నడుమ ఈ కేసులో ఏం జరగనుంది అన్నది అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

అవినాష్ సిబిఐ ముందు హాజరు కాకుండా ఆపింది ఎవరు…

దాము బాలాజీ మాట్లాడుతూ అవినాష్ రెడ్డిని సిబిఐ మరోసారి విచారణకు రమ్మని పిలిస్తే ఇప్పటికిప్పుడు రమ్మని చెబితే మిగిలిన నా పనులకు అంతరాయం కలుగుతుంది కనుక నాలుగు రోజులు టైం కావాలి అంటూ అవినాష్ తరుపు లాయర్ అడగడటం, కుదరదని విచారణకు హాజరువ్వాల్సిందే అని సిబిఐ చెప్పడం నేపథ్యంలో అవినాష్ చేసేదేమి లేక హైదరాబాద్ బయలుదేరగా మధ్యలో సిబిఐ కి ఫోన్ రావడం, విచారణ ఆగిపోవడం జరిగిపోయాయని టీడీపీ అనుకూల మీడియాల్లో కథనాలు వినిపిస్తున్నాయని బాలాజీ అభిప్రాయపడ్డారు.

హాజరవుతాడా లేక కడపలో ఉన్న ఒక సిబిఐ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంటుందా అన్నట్లుగా ఉత్కంఠ రేపిన ఇష్యూలో అవినాష్ ను విచారించలేదు. తిరిగి కడప చేరుకున్న అవినాష్ రెడ్డి ఆయన పనుల్లో బిజీగా ఉన్నారు. నిజానికి సిబిఐ ని ప్రభావితం చేసింది ఎవరో తెలియదు, అది టీడీపీ అనుకూల మీడియానే చెప్పాలంటూ అనలిస్ట్ బాలాజీ అభిప్రాయపడ్డారు.