Analyst Damu Balaji : మా టీవీ లో ప్రసారమయ్యే కలర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయి ఆ తరువాత హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న స్వాతి గురించి ఒక న్యూస్ గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతోంది. స్వాతి అంటే చాలా మంది ప్రేక్షకులకు తెలియక పోవచ్చు కానీ కలర్స్ స్వాతి అంటే మాత్రం అందరికీ బాగా గుర్తొస్తుంది. ఇక డేంజర్, అష్టా చెమ్మ, కార్తికేయ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న స్వాతి ఇటీవల విడాకులు తీసుకుంటోంది అంటూ వస్తున్న వార్తల ద్వారా బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ ఇష్యూ మీద బాలాజీ మాట్లాడారు.

విడాకులంటూ ఎప్పటికప్పుడు వార్తలు…
కలర్స్ స్వాతి మా టీవిలో వచ్చిన కలర్స్ ప్రోగ్రాం ద్వారా మంచి పేరు తెచ్చుకుని ఆపైన హీరోయిన్ అయిన ఆమె కెరీర్ బాగా ఉన్నపుడే పైలట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటూ బాలాజీ తెలిపారు. పెళ్లయ్యాక అతను థాయిలాండ్ లో జాబ్ చేస్తూ ఉండటం వల్ల అక్కడికి వెళ్లిపోయిన స్వాతి మధ్యలో హైదరాబాద్ లో ఎక్కువ రోజులు ఉన్నపుడు పంచతంత్రం అనే సినిమా చేసిందని, అయితే స్వాతి ఇక్కడ ఉండటం ఆమె భర్త థాయిలాండ్ లో ఉండటం వల్ల అందరూ స్వాతి విడాకులు తీసుకోబోతోందని అనుకున్ననారు.

అదీకాక ఆమె వ్యక్తిగత సోషల్ మీడియాలో కూడా భర్తతో ఉన్న ఫోటోలను తీసేయడంతో అందరూ విడాకులనుకున్నారు. కానీ స్వాతి అలాంటిదేమి లేదంటూ అపుడు క్లారిటీ ఇచ్చింది. అయితే ఇపుడు మరోసారి అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. ఆమె తన ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో భర్తతో ఉన్న ఫోటోలను తొలగించడం ప్రస్తుతం ఆమె భర్తకు దూరంగా ఉండటం వల్ల విడాకులు తీసుకోబోతోందనే అంటున్నారు. అయితే ఈ విషయంలో స్వాతి క్లారిటీ ఇవ్వాలి అంటూ బాలాజీ తెలిపారు.