Analyst Damu Balaji : హీరో అబ్బాస్ ఆత్మహత్యయత్నం… కారణం ఆమెనే….: అనలిస్ట్ దాము బాలాజీ

0
86

Analyst Damu Balaji : ఒకప్పటి అమ్మాయిల డ్రీం హీరో ఎవరంటే అబ్బాస్ అని టక్కున చెబుతారు. ప్రేమ దేశం సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడుగా మారడు. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అబ్బాస్. తన హెయిర్‌ స్టైల్‌, స్కిన్‌ కలర్‌తో ఎంతోమంది లేడీ ఫ్యాన్స్‌ ని ఫ్లాట్ చేసిన అబ్బాస్ పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించాడు. 20 ఏళ్ళ వయసులోనే హీరోగా అడుగుపెట్టి.. 40 ఏళ్లకే నటనకు గుడ్‌బై చెప్పేశాడు అబ్బాస్‌. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అబ్బాస్ ఆత్మహత్య యత్నం….

అనలిస్ట్ దాము బాలాజీ అబ్బాస్ గురించి మాట్లాడుతూ ప్రేమ దేశం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ ఆత్మహత్య యత్నం చేసినట్లుగా ఒక ఇంటర్వ్యూ లో తెలపడం వైరల్ అయిందని చెప్పారు. అయితే అది గతంలోని ఇంటర్వ్యూ కాగా అబ్బాస్ సినిమా ఇండస్ట్రీ కి వచ్చాక ఈ పని చేయాలనుకోలేదని బాలాజీ తెలిపారు.

పదో తరగతి ఫెయిల్ అవడంతో అబ్బాస్ సుసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట.రోడ్డు పక్కన వెళ్తున్న ఒక లారీ అటుగా వస్తుంటే దాని కింద పడి చనిపోవాలని అనుకున్నాడట. అయితే లారీ కింద పడితే వెనుకున్న బైక్ వాడు పడి చనిపోతాడేమో అలాగే లారీ డ్రైవర్ పరిస్థితి ఏమిటి అని అలోచించి వద్దన్నుకున్నాడట. అలా సుసైడ్ ఆలోచన వచ్చిన విరామించుకున్నాడు అంటూ బాలాజీ తెలిపారు.