Analyst Damu Balaji : టాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్ళికి రెడీ అయింది. ఏమాత్రం చడీ చప్పుడు లేకుండా ప్రేమించుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ అలాగే హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవలే పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వీరిద్దరి ప్రేమాయణం ఎలా మొదలయింది, వారి కుటుంబాలు ఎలా పెళ్ళికి ఒప్పుకున్నాయి వంటి విషయాలను నెట్టింట్లో చాలా మంది వెతుకుతునే ఉన్నారు. ఇక వారి మీద వరుస కథనాలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరి పెళ్ళికి లావణ్య కు మెగా కుటుంబం కొన్ని కండిషన్స్ పెట్టిందని అంటుంటే మరోవైపు లావణ్య కూడా మెగా ఫ్యామిలీకి కొన్ని కండిషన్స్ పెట్టిందంటూ వినిపిస్తుంది. ఇక వీటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

మెగా ఫ్యామిలీకి పెళ్లి విషయంలో కండిషన్స్ పెట్టిన లావణ్య…
మెగా ఫ్యామిలీ లావణ్య ను ఇంటి కోడలిగా చేసుకునే ముందే పెళ్లి తరువాత నటనకు గుడ్ బై చెప్పాలని కండిషన్స్ పెట్టారట. అది ఒప్పుకుంటేనే పెళ్లి అని చెప్పేశారట. అయితే లావణ్య కూడా కండిషన్స్ కి ఒప్పుకుందనే సమాచారం తెలుస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక లావణ్య కూడా కొన్ని కండిషన్స్ పెట్టిందని ఆయన వివరించారు.

పెళ్లయ్యాక తాను సినిమాల్లో నటించకపోయినా ప్రొడక్షన్ వర్క్ చేస్తానని ఆపై తనకెంతో ఇష్టమైన భరత నాట్య ప్రదర్శనలను ఇస్తానని చెప్పడంతో దానికి మెగా ఫ్యామిలీ అంగీకరించిందని తెలుస్తోందంటూ బాలాజీ తెలిపారు. ఇంతకుముందు సెలబ్రిటీ ప్రేమ వివాహాలలో ఇలా పెళ్ళికి ముందే క్లియర్ గా మాట్లాడుకోకపోవడం వల్లే విడాకుల దాకా వెళ్లారని, సమంత నాగచైతన్య విషయంలో కూడా ఇలా క్లారిటీ లేకపోవడం వల్లే విడాకులు తీసుకున్నారంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.































