Analyst Damu Balaji : తెలంగాణ ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం అన్నీ జరిగిపోయిన సీఎం ఎవరన్నది మాత్రం కాంగ్రెస్ త్వరగా తేల్చలేదు. చివరిలో టెన్షన్ పెట్టినా చివరికి ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించిన రేవంత్ రెడ్డికే సీఎం పదవిని అప్పగించారు. డిసెంబర్ 7వ తేదీన కొత్త రాష్ట్ర తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతుండగా ఇంతలోనే మళ్ళీ ఆరు నెలల్లో నేను సీఎం అవుతా అంటూ కెసిఆర్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

కాంగ్రెస్ గురించి తెలిసిందే కదా అంటున్న కెసిఆర్…
కాంగ్రెస్ పార్టీ గురించి బాగా తెలిసిన కెసిఆర్ మరో ఆరునెలల్లో సీఎం అవుతా అంటూ తన సన్నిహితులతో అనుండవచ్చు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఎలక్టన్ కి ముందే కెసిఆర్ కు 40 సీట్లు వచ్చినా సీఎం కాగలరనే మాటలు వినిపించాయి. కాంగ్రెస్ అరకొర మెజారిటీ గెలవడం వల్ల ప్రభుత్వం కూలగొట్టడం కెసిఆర్ కు పెద్ద పనేమీ కాదు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన మనుషులను బిఆర్ఎస్ లోకి తీసుకుని ఎంఐఎం తో చేతులు కలిపితే కెసిఆర్ సీఎం కాగలడు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. అయితే కెసిఆర్ ఎటువంటి వ్యూహరచన చేస్తున్నాడో ఇప్పటికైతే క్లారిటీ లేదని రేవంత్ ప్రభుత్వానికి కొంత టైం అయితే ఇస్తాడంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.


































