Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో సంచలనమైన రాజకీయ హత్య వైఎస్ వివేకానంద మర్డర్. ఆయనను హత్య చేసింది ఎవరు అన్నది ఎపుడు తేలుతుందో శిక్ష ఎపుడు పడుతుందో తెలియదు కానీ కేసు విచారణ జరుగుతూ రోజుకో వ్యక్తి పేరు బయటికి వస్తోంది. ఇవన్నీ చాలవు అన్నట్లుగా ఆయనకున్న అక్రమ సంంబంధాల వల్లే ఆయనని దారుణంగా చంపారంటూ మరో వాదన వినిపిస్తోంది. అప్రూవర్ గా మారి వాంగ్మూలం ఇచ్చిన దస్తగిరి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇక మరో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కూడా ప్రస్తుతం బెయిల్ మీద ఉండగా వీళ్ళు మీడియాకు చెబుతున్న విషయాలు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయాపడ్డారు.

సిబిఐ వాళ్ళు చితకబాదారు…
సాధారణంగా నిందితుడి నుండి నిజం చెప్పించాలంటే పోలీసులు వారి లాఠీలకు పని చెప్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే సిబిఐ వాళ్ళు కూడా కొడతారు, విచారణలో భాగంగా మాన్ హ్యాండలింగ్ చేస్తారనే విషయం తాజాగా వివేకానంద మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి చెప్పడంతో బయటికి తెలిసింది. ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ మీద ఉండగా నెక్స్ట్ కోర్ట్ హియరింగ్స్ లో ఆ బెయిల్ రద్దు అయి మళ్ళీ జైలుకు వెళ్ళే పరిస్థితి ఉన్నందున ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సుముఖుంగా లేకపోవడంతో కొన్ని మీడియా ఛానెల్స్ ఆయనతో ఇంటర్వ్యూ అని చెప్పకుండా సీక్రెట్ కెమెరా పెట్టి మాట్లాడటం ఇప్పుడు వైరల్ అయింది. అందులో ఇప్పుడు సిబిఐ వారు కొట్టిన దెబ్బలకు రెండు నెలలు నొప్పులు తగ్గలేదంటూ చెప్పడంతో సిబిఐ వాళ్ళు కూడా కొడతారనే విషయం బయటికి వచ్చింది.

ఇక ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ వివేకానంద కేసులో ఎర్ర గంగిరెడ్డి ని ఇరికించారని ఆయన అభిప్రాయపడినట్లు తెలిపారు. ఎర్ర గంగిరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్ దస్తగిరి తనకు పరిచయం లేదని ఆయన చెప్తున్నవాటిలో నిజం లేదని వివరించారు. ఇక తాను 30 ఏళ్లుగా వివేకానంద రెడ్డితో ఉండగా పెళ్లి కుటుంబం లేకుండా తనతోనే ఉన్నానని ఆయన దేవుడితో సమానం అంటూ చెప్పారు. ఆయన హత్య కేసులో నన్ను ఇరికించడం నేను భరించలేక పోతున్నాను. పోయిన జన్మలో చేసిన పాపమే ఇది అంటూ మాట్లాడారని బాలాజీ అభిప్రాయాపడ్డారు.





























