Analyst Damu Balaji : త్రిబుల్ ఆర్ సినిమా సంచలనం రేపింది. ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కొట్టింది. మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియన్స్ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్ర బోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరూ ఆస్కార్ అందుకున్నారు. ఇక తాజాగా అనేక చర్చలు నడుస్తున్నాయి. తెలుగు పాటకు ఆస్కార్ రావడం గర్వకారణం. ఇక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ కి చెందిన వారు కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన మంత్రుల ఆధ్వర్యంలో ఆస్కార్ ఆవార్డు గ్రహీతలను సత్కరించారు. ఈ వేడుకలో కీరవాణి గారు మాట్లాడుతూ రామోజీ రావు గారి గురించి ప్రస్థావించడం హాట్ టాపిక్ అయింది. దీని గురించి అనలిస్ట్ దాము బాలాజి మాట్లాడారు.

రామోజీ లాగా ఒకరోజు బతికినా చాలు…
కీరవాణి గారి స్పీచ్ వేడుకలో హైలైట్ గా నిలిచింది. పాటకు నిజమైన అవార్డు గ్రహీతలు రాజమౌళి అలాగే ప్రేమ్ రక్షిత్ అంటూ చెప్పడం ఆయన హుందా తనానికి నిదర్శనం అంటూ తెలిపారు బాలాజీ. అయితే ఆయన అవార్డు గురించి మాట్లాడుతూ చక్కర తిన్నాక టీ తాగినట్లు ఉంది అంటూ చెప్పడం ఈ అవార్డు చేదుగా ఉంది అని చెప్పడమే దానికి కారణం అని చెప్పారు. కీరవాణి ప్రసాద్ ల్యాబ్ లో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి పాట కంపోజ్ చేయడం వల్ల అవార్డు రావడం గొప్పగా అనిపించలేదు అనే భావనలో చెప్పారంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

ఇక కీరవాణితో తన భార్య వల్లి ఎపుడూ అనేది ‘బతికితే రామోజీ రావు గారిలా ఒక్కరోజైనా బ్రతకాలి’ అని అలాంటి రామోజీ రావు గారి వద్దకు నేను వెళ్ళినపుడు ఆస్కార్ కొట్టాలి మీరు అని ఆయన చెప్పినపుడు ఇదేదో గొప్ప అవార్డు అంత గొప్ప వ్యక్తి చెప్పారంటే అనిపించింది అని మాట్లాడారు. అయితే ఈ విషయం గురించి దాము బాలాజీ మాట్లాడుతూ కీరవాణి గారి సినిమా కెరీర్ లో మొదట ఆయనకు అవకాశం ఇచ్చి ప్రోత్సాహించింది రామోజీ రావు గారే. ఆ తరువాత కొంత సక్సెస్ వచ్చాక రాఘవేంద్ర రావు గారు బ్రేక్ ఇచ్చారు. అందుకే ఆయన రామోజీరావు గారి గురించి అంత గొప్పగా మాట్లాడారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

































