Analyst Damu Balaji : నిత్యానంద స్వామి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ గా ఉండే నిత్యానంద ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలిచేవారు. అయితే నవంబరు 2019లో భారతదేశం వదిలి నిత్యానంద అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. నిత్యానందను దేశంలో విమర్శించే వారితో పాటు పరమ శివుడు రూపం అంటూ దైవ భక్తితో మొక్కే వారు కూడా ఉన్నారు. అందులో నటి రంజిత ముందుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక దేశం వదిలాక నిత్యానంద అసలు ఎక్కడా కనిపించలేదు. ఆయన దేశంలో ఇపుడు కొత్త ప్రధానిగా రంజిత పేరు వినిపిస్తుండగా ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషణ అందించారు.

రంజిత ప్రధాని అయితే నిత్యానంద మరణించాడా…
కైలాస దేశం అంటూ ఒకటి పెట్టి ఆ దేశం హిందూ దేశమంటూ అక్కడికి వెళ్లాలంటే వీసా పాస్పోర్ట్ కావాలంటూ నియమాలను పెట్టి మొన్నామధ్య యూఎన్ఓ లో కూడా ఆ దేశ ప్రతినిధి అంటూ ఒక ఆమె ప్రసంగించడం జరిగిందని బాలాజీ తెలిపారు. అయితే చాలా రోజులుగా నిత్యానంద బయట కనిపించకపోవడం వల్ల అతను మరణించాడనే వార్తలు బాగా వినిపించాయి. తాజాగా ఆయన శిష్యులలో ముఖ్యురాలైన రంజిత కైలాస దేశానికి ప్రధాన మంత్రి అంటూ ప్రచారం జరుగుతుందటం చూస్తుంటే నిత్యానంద లేడనే అనిపిస్తోందని తెలిపారు బాలాజీ. మొదటగా రంజిత ప్రధాని అనే విషయం ఒక తమిళ పత్రికలో రాగా దాంతో న్యూస్ వైరల్ అయింది.

ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా నిత్యానంద బోధనలు అలాగే రంజిత ప్రధాని అనే విషయాలు వీడియోల రూపంలో ఉన్నాయ్. ఆమె నటిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి సన్యాసిని అయ్యేవరకు ఉన్న మార్పు ఒక వీడియోలో ఉంది అంటూ బాలాజీ తెలిపారు. నిత్యానందమయి స్వామి గా రంజిత పేరు కనిపిస్తుంది ఆ వీడియోలలో అంటూ బాలాజీ తెలిపారు.



























