Analyst Damu Balaji : ఏపీ రాజకీయాలలో మరోసారి గెలుస్తాననే ధీమాతో సీఎం జగన్ ఉండగా, ఈసారి అవకాశం వదులుకోనంటూ టీడీపీ వ్యూహలు రచిస్తోంది. ఇక వీరి మధ్య నాకు ఒక అవకాశం ఇవ్వండంటూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు గెలుపు గుర్రాల కోసం వేట మొదలు పెట్టేసాయి. మరోవైపు జంపింగ్ నేతలు మొదలయ్యారు. వైసీపీ లో ఉన్నవాళ్లు టీడీపీ కి టీడీపీ లో ఉన్న వాళ్ళు వైసీపీకి వలసలు మొదలయ్యాయి. తాజాగా గన్నవరం నియోజకవర్గం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట రావు టీడీపీ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

టీడీపీ లోకి వైసీపీ లీడర్.. వైసీపీ లో టీడీపీ లీడర్…
గన్నవరం మొదటి నుండి టీడీపీ కంచుకోట రెండు సార్లు మినహాయించి ఇప్పటివరకు అక్కడ ఓడింది లేదు. అయితే టీడీపీ పార్టీ నుండి గెలిచి వైసీపీ లోకి జంప్ అయినా వల్లభనేని వంశీ వల్ల అక్కడ బలమైన టీడీపీ నేత కరువయ్యడు. ఇక వైసీపీ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట రావు గారు కూడ తన ప్రత్యర్థి అయిన వంశీ తో కలిసి పనిచేయడం నచ్చక వైసీపీ అధిష్టానంతో విన్నవించుకున్న ఫలితం లేకపోవడంతో చివరికి టీడీపీ తీర్థం పూచ్చుకోడానికి సిద్ధమయ్యడు.

బహటంగానే చంద్రబాబు కు నేను పార్టీలో చేరుతా ఎమ్మెల్యే సీటు ఇవ్వండని అడిగేసారు యార్లగడ్డ. దీంతో చంద్రబాబు తాజాగా లోకేష్ కి ఈ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు. దీంతో బలమైన నేతగా ఉన్న వంశీ ని ఎన్ఆర్ఐ అయినా యార్లగడ్డ డీ కొట్టగలడా అన్నది ఇపుడు అక్కడ బెట్టింగ్ అంశం గా మారిపోయిందంటూ బాలాజీ తెలిపారు.





























