Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో పొత్తులు మీదే చర్చలు జోరుగా జరుగుతుంటే ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేల ప్రతి పార్టీ తమ బలాబలాలను తెలుసుకోడానికి సర్వేలను చేస్తుంటారు. అయితే ఈ సర్వేలో వచ్చే ఫలితం కూడా ఒక్కోసారి రాజకీయంగా వాడుకోడానికి వాడుతుంటారు మన నాయకులు. తాజాగా ఐ ప్యాక్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఏపీ లో నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గాలికి కష్టమేనంటూ చెప్పింది. “వై నాట్ 175” అంటున్న జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ కి బ్రేకలు వేసి ముందొచ్చిన 151 కాపాడుకోమని హెచ్చరించినట్లయింది. అయితే ఈ సర్వే నిబద్ధత అలాగే జగన్ వ్యూహాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జగన్ కు షాక్ ఇచ్చిన సర్వే…
ఇప్పటికే వచ్చే ఎన్నికలలో గెలిచే గుర్రాలకే టిక్కెట్లు ఇస్తానని రిపోర్ట్స్ ద్వారా ఎమ్మెల్యేలను కడిగిపారేసిన జగన్ కు ఈ సర్వే షాక్ ఇచ్చింది. తన ఇమేజ్ తో 151 సీట్లను ఏపీలో కొల్లగొట్టిన జగన్ ఈ సారి 175 మనవే అనడం కొంత ఓవర్ గా ఉన్నా అది మైండ్ గేమ్ అంటూ అందరూ లైట్ తీసుకుంటున్నారు. అయితే జగన్ ఇమేజ్ ను పక్కనబెడితే నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఇమేజ్ ఏమాత్రం బాగోలేదని జగన్ కి నివేదికలు వచ్చాయట.

ఆ నివేదికలలో ఎవరికి తక్కువ మార్కులు వచ్చాయో వారికి క్లాస్ పీకి నెక్స్ట్ రిపోర్ట్ వచ్చే వరకు ఛాన్స్ ఇస్తా మారండి అని జగన్ చెప్పారంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సర్వేలను నమ్మేకాలం ఎపుడో పోయింది. ఒక రాజకీయ పార్టీకి మేలు చేసే విధంగా స్ట్రాటెజీ లో భాగంగా కొన్ని సర్వేలు రావడం వల్ల అన్నింటినీ సందేహించాల్సిన పరిస్థితి అంటూ బాలాజీ తెలిపారు. ఏం జరగబోతుందో తెలియాలంటే మాత్రం ఎన్నికల వరకు ఆగాల్సిందే అంటూ చెప్పారు బాలాజీ.






























