Analyst Damu Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసిన కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం, అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగించే అంశం. ఇక రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం కలిగిస్తున్న ఈ కేసులో అవినాష్ రెడ్డిని తరచూ సిబిఐ విచారిస్తుండగా అరెస్టు తప్పదు అనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా అవినాష్ రెడ్డి పేరు మరుగున పడి ఉదయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. తాజాగా సిబిఐ ఆయనను అరెస్టు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది. ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన స్టైల్ విశ్లేషణ అందించారు.

ఉదయ్ కుమార్ ను అరెస్టు చేసిన సిబిఐ…
బాలాజీ మాట్లాడుతూ మొదట్లో గుండెపోటు అన్నారు, తరువాత కూతురు సునీతనే వివేకానంద్ రెడ్డిని చంపించింది అన్నారు. తాజాగా సునిల్ యాదవ్ తన తల్లి మీద లైంగిక వేధింపులకి పాల్పడటం వల్ల వివేకానంద రెడ్డిని చంపించాడు అంటూ అవినాష్ రెడ్డి బ్యాచ్ అంటోంది. అయితే రోజుకో కథనం పూటకో కొత్త నిందితుడు కేసులో వస్తున్నారు అంటూ అభిప్రాయాపడ్డారు. తాజాగా ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని సిబిఐ అరెస్టు చేసింది. అసలు ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరు, కేసుతో సంబంధం ఏమిటి అనే విషయాలను బాలాజీ వివరించారు.

భారతి రెడ్డి గారి తండ్రికి పులివెందులలో ఉన్న హాస్పిటల్ సిబ్బందిలో ఒకడు ఉదయ్ కుమార్ రెడ్డి. వివేకానంద రెడ్డి హత్య అనంతరం తలకు కుట్లు వేసినట్లుగా సాక్షాలను మార్చినట్లుగా అభియోగాలు ఉదయ్ కుమార్ మీద వచ్చాయి. ఇక సిబిఐ ఆల్రెడీ ఒకసారి పిలిచి విచారించగా తాజాగా అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. భాస్కర్ రెడ్డి గారు అడగడం వల్ల కుట్లేసానని ఉదయ్ కుమార్ చెప్పినట్లుగా తెలుస్తున్న కేసులో అప్రూవల్ గా మారిన దస్తగిరికి ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిన కోర్ట్ ఇక తదుపరి నిర్ణయాలను ఎలా తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉందని బాలజీ అభిప్రాయాపడ్డారు.





























