Analyst Damu Balaji : సరూర్ నగర్ కి చెందిన వెంకట సూర్య సాయి కృష్ణ అనే 36 ఏళ్ల వ్యక్తి అక్కడి స్థానిక దేవాలయంలో పూజారిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే బిల్డర్ గా ఉన్న సాయి కృష్ణ కు తన తండ్రికి అక్కడి చుట్టుపక్కల మంచి పలుకుబడి ఉంది. ఇక చెన్నై నుండి వచ్చి సరూర్ నగర్ లో స్థిరపడిన అప్సర అనే 30 ఏళ్ల యువతి తన తల్లితో పాటు ఉంటోంది. అప్సర తండ్రి కాశిలో పని చేస్తుండగా ఇక్కడ తల్లి వద్దే ఉంది అప్సర. ఇక తనకు ఒక అక్క ఉండగా ఆమెకు పెళ్ళై చెన్నైలో ఉంది. అప్సర గుడికి వెళ్తుండగా సాయికృష్ణ పరిచయం అవడం, ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడం జరిగాయి. చివరకు సాయి కృష్ణ అప్సరను హత్య చేసే వరకు పరిస్థితులు వెళ్లాయి. ఇక ఈ ఇష్యూలో అప్సర తల్లి వినిపిస్తున్న కొత్త వాదన గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

సాయికృష్ణ తో పాటు తండ్రి హస్తం కూడా ఉంది…
అప్సర హత్య కేసులో ఇప్పటికే సాయికృష్ణ నేను నేరం చేసానని ఒప్పుకొని అయితే ఆమె ఒత్తిడి చేయడం వల్లే చేసానని చెప్పాడు. అయితే అప్సర తల్లి మాత్రం సాయికృష్ణ ఇలాంటి వాడని అనుకోలేదని, ఇలా తన కూతురిని చంపేస్తాడని అనుకోలేదని, అతనోక్కడే ఈ హత్య చేయలేదని తండ్రి సహకారం కూడా ఉండి ఉంటుందంటూ కొత్తగా ఆరోపిస్తున్నారని బాలాజీ తెలిపారు.

అటు సాయి కృష్ణ తండ్రి అప్సర గతం గురించి మాట్లాడుతుంటే ఇటు అప్సర తల్లి సాయికృష్ణ కుటుంబం మీద నింద వేస్తోంది. అలా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ఉన్నారని పోలీసులే నిజాలను వెలుగులోకి తేవాల్సి ఉందని అనాలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.



























