Analyst Damu Balaji : రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు కాదు శాశ్వత మిత్రులు కాదు. పక్కన స్నేహితుడిగా ఉంటూ కూడా తననే ముంచేసే వ్యూహాలు నేటి రాజకీయాల్లో తరచూ చూస్తూనే ఉంటాం. తెలంగాణ ఇవ్వగానే కాంగ్రెస్ లో పార్టీ విలీనం చేస్తా అన్న కెసిఆర్ ఆ వెంటనే మాట మార్చి రాజకీయా పార్టీగా నిలబెట్టి కాంగ్రెస్ ని మట్టికరిపించి రెండు సార్లు సీఎం అయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఏక్కడ చోటు లేకుండా చేసాడు. ఆలా రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో పసిగట్టడం అంత ఈజీ కాదు. తాజాగా ఏపీ రాజకీయాల్లో కుడా ఎవరు ఎవరికీ సహాయ పడుతున్నారో అర్థం కానీ పరిస్థితి. పైకి కనిపిస్తున్నది ఒక సినిమా అయితే లోగుట్టు వేరేలా ఉంది అంటూ అనలిస్ట్ బాలాజీ విశ్లేషిస్తున్నారు.

జగన్, పవన్ టార్గెట్ ఒక్కటే….
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జగన్ మైకు పట్టుకుంటే పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ జగన్ మీద ఫైర్ అవుతున్నాడు. నిజానికి ఏపీ లోప్రతిపక్షం టీడీపీ అయినా ఒక్క సీటు గెలవని రాబోయే ఎన్నికల్లో సీఎం అయ్యే ఛాన్స్ లేని పవన్ మీద వైసీపీ పడటం వెనుక విషయం వేరే ఉందంటున్నారు దాము బాలాజీ.

పవన్, జగన్ ఇద్దరు కలిసి టీడీపీ కి ప్రచారం ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. ఇద్దరి టార్గెట్ చంద్రబాబు నాయుడే అంటూ చెప్పారు. అందుకే వాళ్ళు వాళ్ళు మాట మాట అనుకుంటూ మీడియా అటెన్షన్ వాళ్ళ మీదే పెట్టుకుంటున్నారు కానీ చంద్రబాబు మీద కానీ లోకేష్ పాదయాత్ర గురించి కానీ మాట్లాడరు. జగన్ వ్యూహత్మాకంగా జనాల దృష్టిని మరల్చడానికే ఇలా ప్లాన్ చేసారనిపిస్తోంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

































