Analyst Damu Balaji : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి, అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి. నిజానికి తెలుగు ప్రేక్షకులకు మెంటల్ కృష్ణ అని చెబితే బాగా గుర్తొచ్చే పోసాని విభిన్నంగా విలనిజం చూపిస్తాడు అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసిన పోసాని గాయం, నాగార్జున రక్షణ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు. ఇక రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉన్న పోసాని గారు ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు.

కొడుకులిద్దరికీ ఎందుకు పెళ్లి చేయలేదు…
పోసాని గారికి ఇద్దరు అబ్బాయిలు మొదటి కొడుకు ప్రజ్వల్ కు మంచి నాలెడ్జి ఉందని పోసాని గారే పలు ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. ఏ విషయం గురించి అయినా చాలా చక్కగా చెప్పగలడని చెబుతుంటారు. అయితే పెద్దబ్బాయి ఫిల్మ్ కోర్స్ చేసినా ఇండస్ట్రీలో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదట. దేశ విదేశాలు తిరుగుతూ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను నాకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు చేసుకుంటా తమ్ముడికి కావాలంటే పెళ్లి చేయండి అని ఎపుడో చెప్పేసాడట ప్రజ్వల్.

ఇక పోసాని గారి రెండో కొడుకు ఉజ్వల్ గురించి బాలాజీ గారు మాట్లాడుతూ తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ముఖ్యంగా కొరటాల వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు అని చెప్పారు. ఇప్పటికే ‘భరత్ అనే నేను’ సినిమా కోసం పనిచేసిన ఉజ్వల్ సొంతంగా సినిమా డైరెక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఆ పని మీద ఉన్నాడట. అయితే తాను సెటిల్ అయ్యే ఛాన్స్ ఉందని బాలాజీ గారు అభిప్రాయాపడ్డారు.































