Analyst Damu Balaji : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే బాహుబలి సినిమా తరువాత అంత పెద్ద హిట్ సినిమా మళ్ళీ ప్రభాస్ కోటాలో రాలేదు. బాహుబలి సినిమా తరువాత ‘సాహో’ అలాగే ‘రాధే శ్యాం’ సినిమాలు డిజాస్టర్లుగా మిగలగా ఆదిపురుష్ పర్వాలేదనిపించింది. అయితే బాలీవుడ్ మాత్రం ప్రభాస్ క్రేజ్ ను ఓర్చుకోలేకపోతోందనే అనిపిస్తోంది. అందుకే ఏదో ఒక సందర్భంలో కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. రాధే శ్యామ్ టైంలో కూడా ప్రభాస్ లుక్స్ మీద కామెంట్స్ చేసారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ గురించి ఆయన ఫ్యాన్స్ గురించి హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ బాలాజీ వివరించారు.

ప్రభాస్ మంచి నటుడే కాదు…
వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ తాజా చిత్రం ‘సలార్’ సినిమా గురించి మాట్లాడారు. సలార్ నుండి కొత్తగా వచ్చిన అప్డేట్ తో సోషల్ మీడియా ఊగిపోతుంటే ఇలాంటి హింసాత్మక చిత్రాలను తీయాలని తెలుగు వాళ్ళు ఎందుకు అనుకుంటారో అంటూ మండి పడ్డాడు అగ్నిహోత్రి. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ అతను ఒక పనికిరాని హీరో అంటూ ఆయన ఇలాంటి హింసాత్మక సినిమాలను తీస్తుంటే చూస్తున్న ఆయన ఫాన్స్ కు బుద్ధిలేదంటూ ఫైర్ అయ్యారు. సినిమాలలో చూపే వయొలెన్స్ వల్ల సమాజం ప్రభావితం అవుతుంది అంటూ అయన పేర్కొన్నాడు.

ఇక ఈ విషయం గురించి బాలాజి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ అవ్వొచ్చు కానీ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే హింసాత్మక సన్నివేశాలు లేవు, అన్ని ఇండస్ట్రీలలో వస్తున్న సినిమాలలో ఉంటున్నాయి. ప్రభాస్ మీద బాలీవుడ్ ఈరోజు కొత్తగా అక్కసు వెళ్ళగక్కడం లేదు అంటూ అభిప్రాయపడ్డారు.


































